Rajapaksa Family Rule : పారి పోయినా ‘రాజపక్సే’దే పవర్
మోస్ట్ పవర్ ఫుల్ రాజ కుటుంబం
Rajapaksa Family Rule : శ్రీలంకను ముప్పు తిప్పలు పెట్టిన ఎల్టీటీఈని మట్టు పెట్టిన రాజపక్సే కుటుంబానికి ఊహించని రీతిలో ఆదరణ లభించింది. రాజ్యాధికారం కట్టబెట్టేలా చేసింది.
కానీ అదే పవర్ ను అడ్డం పెట్టుకుని అధికారాన్ని చెలాయిస్తూ వచ్చిన గోటబయ రాజపక్సే ప్రెసిడెంట్ గా తన ఇష్టానుసారం వ్యవహరించాడు. దేశం అన్ని రంగాలలో నాశనం అయ్యేందుకు దోహద పడ్డాడు.
దేశాన్ని ఒక రకంగా చైనాకు దాసోహం అనేలా చేశాడు. తన సోదరుడు మహీంద రాజపక్సే(Rajapaksa Family Rule) కు ప్రధాన మంత్రిగా, మరో
సోదరుడు ఆర్థిక మంత్రిగా, తన కుటుంబంలోని వారందరికీ ఏదో రకంగా కీలకమైన పదవుల్లో ఉండేలా చేశాడు గోటబయ.
కానీ రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని మాత్రం గుర్తించలేక పోయాడు. రాజ భవనంలోనే అన్ని సుఖాలను అనుభవిస్తూ ఎంజాయ్ చేశాడు.
చివరకు జనం రోడ్ల మీదకు వచ్చి ప్రధాని ఇంటిని ముట్టడించడంతో మేల్కొన్నాడు. దిద్దుబాటు చర్యలకు దిగాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది శ్రీలంక పరిస్థితి. మహీంద రాజపక్సేకు రాజకీయ అనుభవం ఎక్కువ.
కానీ గోటబయకు అలా కాదు. చివరకు తన భవనాన్ని ముట్టడించారు లక్షలాది మంది ప్రజలు. దీంతో ముందే గ్రహించిన గోటబయ ఆర్మీ
సహకారంతో పారి పోయాడు.
మాల్దీవులకు చెక్కేశాడు. సైనిక కాపలాతో తను వెళ్లాల్సి వచ్చింది. తమ్ముడి స్థానంలో నియమించిన రణిలే విక్రమ సింఘే ప్రధానిగా ఉన్నాడు.
అతడిని కూడా జనం వద్దన్నారు.
విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరాడు. ఇక శ్రీలంకపై కార్య నిర్వాహణ అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు గోటబయ. 72 ఏళ్ల
వయస్సు కలిగిన ఆయన 2019లో అధికారం చేపట్టారు.
2005 నుండి 2015 వరకు మహీందా రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నంత కాలం సైన్యం, పోలీసులకు చీఫ్ గా ఉన్నాడు గోటబయ. 2009లో
అంతర్యుద్దం, వేర్పాటువాద తమిళ తిరుగుబాటుదారులను అణిచి వేసేందుకు ప్రయత్నం చేశాడు.
యుఎన్ అంచనాల ప్రకారం 40,000 వేల మంది పౌరులు చని పోయినట్లు అంచనా వేసింది. తెల్ల వ్యాన్లలో డజన్ల కొద్దీ ప్రత్యర్థులను అపహరించి కనమరుగైన వారి మరణాల వెనుక గోటబయ ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి.
తన స్వంత కుటుంబంతో ది టెర్మినేటర్ అని పిలిచేలా చేసుకు్నాడు. ఇక మహీందా రాజపక్సే విషయానికి వస్తే ఆయనకు 76 ఏళ్లు. ఒక
దశాబ్దం పాటు శ్రీలంకకు చీఫ్ గా ఉన్నాడు. 2004లో పీఎంగా ఉన్నాడు.
తమిళుల్ని ఊచ కోత కోయించాడు. సింహాళ-బౌద్ధ మెజారిటీ ఆయనను ఆరాధించారు. యుద్ధ సమయంలో జరిగిన అకృత్యాలపై అంతర్జాతీయ విచారణను తిరస్కరించాడు.
ఆయన హయంలోనే శ్రీలంక చైనాకు దగ్గరైంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం $7 బిలియన్లను అప్పుగా తీసుకుంది. ఆయన
భవనంపై దాడి చేయడంతో మహీందా పారి పోయాడు.
మరో వ్యక్తి 71 ఏళ్ల బాసిల్ రాజపక్సే. ప్రభుత్వ ఖజానా నుండి మిలియన్ల డాలర్లను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన సోదరుడు
గోటబయ అధ్యక్షుడు అయ్యాక ఆయనపై ఉన్న కేసులన్నీ ఎత్తి వేశారు. బాసిల్ ను ఆర్థిక మంత్రిగా చేశారు.
ఆ తర్వాత తొలగించారు. ఇక నీటి పారుదల శాఖను చూసే బాధ్యతల్ని తోబుట్టువు చమల్ కు అప్పగించారు. అతడి కుమారుడు
శశీంద్ర రసాయన ఎరువుల దిగుమతులపై నిషేధం ఎదుర్కొన్నాడు.
ఇక మహీంద పెద్ద కుమారుడు నమల్ క్రీడా మంత్రిత్వ శాఖను నడిపాడు. సంక్షోభానికి ముందు భవిష్యత్తు నాయకుడిగా పేరొందారు.
Also Read : తుపాకుల మోత కనిపిస్తే కాల్చివేత