Ashok Gehlot : మహిళలకు అశోక్ గెహ్లాట్ తీపికబురు
వర్క్ ఫ్రం హోమ్ కు అవకాశం
Ashok Gehlot : రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతలో భాగంగా ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే మరోసారి పవర్ లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తనదైన స్టైల్ లో పని చేసుకుంటూ పోతున్నారు.
ప్రధానంగా రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలో కేవలం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండే రెండు రాష్ట్రాలు ఉన్నాయి.
ఒకటి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ కాగా మరొకటి ఛత్తీస్ గఢ్. దీనికి భూపేష్ బఘేట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలలో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళలకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఆ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు గెహ్లాట్.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు తమ ప్రభుత్వం ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించడం జరిగందన్నారు.
జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఎవరైనా సరే తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు సీఎం. వేతనాలు ఎంత ఇవ్వాలనేది ఆయా శాఖలు, సంస్థలు, కంపెనీలు నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్.
Also Read : కాఫీ బోర్డు ఆఫ్ ఇండియా సభ్యుడిగా శ్రీశాంత్