RR vs CSK IPL 2022 : రసవత్తర పోరులో రాజస్తాన్ రాజసం
5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం
RR vs CSK IPL 2022 : ఐపీఎల్ 2022లో నువ్వా నేనా అన్న రీతిలో సాగింది చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్తాన్ రాయల్స్(RR vs CSK IPL 2022) జట్ల మధ్య లీగ్ మ్యాచ్. ఇప్పటికే సీఎస్కే పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానాల్లో ఉన్నాయి ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ .
5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది రాజస్థాన్. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా లక్నో సూపర్ జెయింట్స్ సమాన పాయింట్లు ఉన్నప్పటికీ రాజస్తాన్ జట్టు మెరుగైన రన్ రేట్ ఉండడంతో సెకండ్ ప్లేస్ కు చేరింది.
ఏకపక్షంగా సాగుతుందని అనుకున్న ఈ లీగ్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠను రేపింది. నరాలు తెగే ఉత్కంఠను కలుగ చేసింది.
మొన్న లక్నో వర్సెస్ కోల్ కతా మధ్య చివరి బంతి దాకా ఆట సాగింది.
సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 151 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. రాజస్థాన్ స్టార్ బ్యాటర్(RR vs CSK IPL 2022) యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు.
మొదటి నుంచీ దంచి కొట్టాడు. 59 పరుగులు చేసి సత్తా చాటాడు. ఎప్పటి లాగే జోస్ బట్లర్ నిరాశ పరిచాడు. ఆఖరులో రవిచంద్రన్ అశ్విన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
తానే అన్నీ అయి జట్టును విజయ పథంలోకి చేర్చాడు. 40 పరుగులు చేసి తనకు ఎదురు లేదని చాటాడు. ఇక సీఎస్కే బౌలర్లలో ప్రశాంత్ సోలంకి రెండు, సిమర్ జిత్ సింగ్ , మొయిన్ అలీ , శాంటర్న్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు సీఎస్కే స్కిప్పర్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొయిన్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 93 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 రన్స్ చేసింది.
Also Read : కమోయిన్ అలీ శివమెత్తినా తప్పని ఓటమి