Rajasthan Royals : క్రికెట్ యోధుడా అల్విదా

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నివాళి

Rajasthan Royals  : ఆసిస్ క్రికెట్ దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో యావ‌త్ క్రికెట్ లోకం శోక‌సంద్రంలో మునిగి పోయింది. తాజా, మాజీ ఆట‌గాళ్ల సంతాప సందేశాల‌తో మునిగి పోయింది.

వ‌న్డేల్లో, టెస్టుల్లో త‌న కెరీర్ ను అద్భుతంగా ముగించాడు వార్న్. అంతే కాదు షేన్ వార్న్ కు భార‌త్ తో ఎన‌లేని బంధం ఉంది.

ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు (Rajasthan Royals )కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు షేన్ వార్న్.

ఎంతో మంది క్రికెట‌ర్ల‌కు ఛాన్స్ ఇచ్చాడు. వారిలో ధైర్యాన్ని నింపాడు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది.

షేన్ వార్న్ 2008 నుంచి 2011 దాకా మూడేళ్ల పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున 55 మ్యాచ్ లు ఆడాడు.

ఆ కాలంలో యువ భార‌త ఆట‌గాళ్ల‌కు దిశా నిర్దేశం చేశాడు. అండ‌ర్ డాగ్స్ గా ఉన్న ఆర్ఆర్ టీంకు ఏకంగా ఐపీఎల్ టైటిల్ ను తీసుకు వ‌చ్చేలా చేశాడు. ఈ క్రెడిట్ అంతా వార్న్ కు ద‌క్కుతుంది.

14 ఏళ్ల కింద‌ట సాధించిన ఆర్ఆర్ టీంకు ఆ టైటిలే మిగిలింది. ఇప్ప‌టి దాకా క‌ప్ ద‌క్క‌లేదు.

దిగ్గ‌జ లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ తో ర‌వీంద్ర జ‌డేజా, యూసుఫ్ ప‌ఠాన్ ల‌పై ప్ర‌త్యేక అనుబంధం ఉంది.

ఈ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అసాధార‌ణ‌మైన రీతిలో నివాళులు అర్పించింది. షేన్ వార్న్ అంటేనే మాయాజాలం. మా జ‌ట్టుకు మొద‌టి రాయ‌ల్ అత‌డు.

అసాధ్య‌మ‌న్న దానిని సుసాధ్యం చేసిన వ్య‌క్తి. అండ‌ర్ డాగ్ ల‌ను ఛాంపియ‌న్ లుగా మార్చిన నాయ‌కుడు. తాకినదంతా బంగారంగా మార్చిన గురువు అని పేర్కొంది.

ప్ర‌పంచం ఇవాళ విషాదంలో మునిగి పోయింది. వార్న్ చిరున‌వ్వు, ప్ర‌కాశవంత‌మైన మోము, సంపూర్ణంగా జీవించాల‌నే అత‌డి వైఖ‌రి ఉంటుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది క్రికెట్ అభిమానుల మాదిరిగానే తాము కూడా బాధ‌లో ఉన్నామ‌ని తెలిపింది.

Also Read : పాకిస్తాన్ జోరు ఆస్ట్రేలియా బేజారు

Leave A Reply

Your Email Id will not be published!