Rajasthan Royals Retention : తొమ్మది మంది ఆటగాళ్లకు చెక్
రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం
Rajasthan Royals Retention : ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో రన్నరప్ ఆ నిలిచింది కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు. నవంబర్ 15 డెడ్ లైన్ కావడంతో ఆ జట్టు మేనేజ్ మెంట్ ఈసారి కఠిన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ , డైరెక్టర్ గా ఉన్న శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరతో సంప్రదింపులు జరిపాక కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఈసారి తమ జట్టు నుంచి ఏకంగా తొమ్మిది మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇది క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా డారిల్ మిచెల్ , డస్సెన్ కూడా ఉండడం విశేషం. ఇక జట్టు పరంగా చూస్తే ఎప్పటి లాగే సంజూ శాంసన్ మీద నమ్మకం ఉంచింది.
అతడికే ఈసారి పగ్గాలు అప్పగించింది. ఇక జట్టు పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ సారథి కాగా యశస్వి జైస్వాల్ , సిమ్రోన్ హెట్మెయర్ , దేవదత్ పడిక్కల్ , జోస్ బట్లర్ , రియాన్ పరాగ్ , ధ్రువ్ జురెల్ , ప్రసిద్ద్ కృష్ణ , టెంట్ బౌల్ట్ , మెక్ కాయ్ , నవదీప్ షైనీ, కుల్దీప్ సేన్ , రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహల్ ను జట్టులో కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals Retention) .
ఇక వదిలేసుకున్న వాళ్లలో చూస్తే అనునయ్ సింగ్ , కార్బిన్ బాష్ , డారిల్ మిచెల్ , నీషమ్ , కరుణ్ నాయర్ , నాథన్ కౌల్టర్ నైల్ , రాస్సీ వాన్ డెర్ డస్సెన్ , శుభమ్ గర్వాల్ , తేజస్ బరోకాలను విడిచి పెట్టింది.
Also Read : శార్దూల్ ఠాకూర్ ..కేఎస్ భరత్ కు షాక్