రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ను రాజులా చూసింది
ప్రశంసలు కురిపించిన శాంసన్ తండ్రి విశ్వనాథన్
కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన తండ్రి విశ్వనాథన్ శాంసన్. గురువారం తను మీడియాతో మాట్లాడారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ బిగ్ టోర్నీ ప్రారంభం కానుందని, తను ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లాడనేది కారణం ఏమిటో బయట పెట్టాడు . ఈ సందర్బంగా రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం గురించి ప్రశంసలు కురిపించాడు. సదరు సంస్థ తన కొడుకును రాజు లాగా చూసుకుందని చెప్పాడు విశ్వనాథన్ శాంసన్.
నా కొడుకుకి అన్నీ ఇచ్చింది. అక్కడ అతన్ని కింగ్ లా ట్రీట్ చేశారు. ఒక్క అతని తలపై కిరీటం పెట్టలేదు తప్ప అని పేర్కొన్నాడు. కానీ కాలం గడిచేకొద్దీ, యశస్వి జైస్వాల్ , రియాన్ పరాగ్ లకు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ కావాలనే కోరిక ఉందని నా కొడుకు గ్రహించాడని తెలిపాడు. నా కొడుకు వచ్చి నాతో మాట్లాడాడు. తాను ఇక్కడ నుండి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. ఇద్దరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లని తెలిపాడు. రియాన్ ఇప్పటికే అస్సాంకు కెప్టెన్‌గా ఉన్నాడు, జైస్వాల్ ముంబైకి కెప్టెన్‌గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి చాలా ఆలస్యం కాకముందే ఫ్రాంచైజీ నుండి వైదొలగడం మంచిదని సంజు శాంసన్ భావించాడు. మేము ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి వివిధ ఫ్రాంచైజీల నుండి ఆఫర్లు వచ్చాయని చెప్పాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ వాస్తవానికి ప్రారంభంలో చిత్రంలో లేడు. కానీ ఇప్పుడు ఆ జట్టు తరపున ఆడబోతున్నాడని తెలిపాడు.
