Rajat Patidar : వీడు మామూలోడు కాదు మగాడు
రజిత్ పటిదార్ జోర్దార్ ఇన్నింగ్స్
Rajat Patidar : ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అద్భుతమైన ఆట తీరుతో ఔరా అనిపించేలా ఆడాడు మధ్య ప్రదేశ్ కు చెందిన యంగ్ స్టార్ రజత్ పటిదార్. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎవరినీ ఉపేక్షించ లేదు. నిప్పులు చిమ్మేలా దంచి కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏ బౌలర్ ను వదిలి పెట్టలేదు.
పటిదార్ దెబ్బకు లక్నో ఠారెత్తింది. ఒకానొక దశలో ఏం చేయాలో పాలు పోక లక్నో ఆటగాళ్లు మైదానంలో అలాగే ఉండి పోయారు. ఇక ఆ జట్టు హెడ్ కోచ్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ముఖం గంభీరంగా మారి పోయింది.
టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది.
ఈ మొత్తం పరుగుల్లో సగానికి పైగా రన్స్ ఒక్క రజత్ పటిదార్ చేసినవే ఉన్నాయంటే ఎంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడో అర్థం అవుతుంది. స్టార్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు పటిదార్(Rajat Patidar).
ప్రతిష్టాత్మకమైన ఈడెన్ మైదానంలో పరుగుల వరద పారించాడు పటిదార్. 54 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
ఆఖరులో వచ్చిన దినేశ్ కార్తీక్ 23 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స్ తో 37 రన్స్ చేశాడు. విచిత్రం ఏమిటంటే సిసోడియా గాయ పడడంతో అతడి స్థానంలో ఛాన్స్ దక్కింది పటిదార్ కు(Rajat Patidar) .
దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించు కున్నాడు. దుమ్ము రేపాడు. దంచి కొట్టాడు. లక్నోకు షాక్ ఇచ్చాడు. వారెవ్వా వీడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : వారెవ్వా దీపక్ హూడా సూపర్