Rajendranath Reddy : చంద్రబాబు శ్వేతపత్రంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి

అప్పులపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు...

Rajendranath Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హైదరాబాద్‌లో స్పందించారు. ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టింది శ్వేత పత్రమా? సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేమని చెప్పే సాకు పత్రమా? చెప్పాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తారని ప్రజలు ఎన్నుకుంటే మొదటి ఓవర్లోనే డకౌట్‌ అయ్యారని విమర్శించారు. వైట్‌ పేపర్‌ ఇచ్చి పథకాలు అమలు చేయలేమని చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

Rajendranath Reddy Comment

వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ గవర్నర్‌తోనూ అబద్దం చెప్పించారన్న బుగ్గన… అప్పులపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో సమావేశం పెట్టకుండా హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు… ‘ఆస్పత్రికి కోసం వచ్చాం. విజయవాడకు వెళ్లి పెట్టేందుకు ఆలస్యమవుతుందనే కారణంగా ఇక్కడ సమావేశం పెట్టాను’ అని బుగ్గన వివరణ ఇచ్చారు.

Also Read : Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టుయంత్రం పంపించిన రాహుల్‌గాంధీ !

Leave A Reply

Your Email Id will not be published!