Rajinikanth Comment : సింప్లిసిటీ తలైవా చోదక శక్తి
72 ఏళ్ల కుర్రాడు సూపర్ స్టార్
Rajinikanth Comment : ఎవరైనా 50 ఏళ్లకే నీరస పడి పోతారు. టెక్నాలజీ మారింది. అభిరుచులు, ఆహార అలవాట్లు మారాయి. కానీ ఒక మనిషి తన జీవిత కాలంలో కొన్నేళ్లుగా నిరంతరం నటించడం అంటే మాటలా. పోనీ గ్రాఫిక్స్ మాయాజాలం, దర్శకుడి ఇంద్రజాలం అనుకున్నా కనీసం పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలిగా. తాజాగా తమిళ సినీ రంగంలో స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఉంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన జైలర్(Jailer) చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకించి రజనీకాంత్ అంటేనే భిన్నమైన మేనరిజానికి పెట్టింది పేరు. ఇంకేం కాసులు కురుస్తున్నాయి. డబ్బాలు నిండుతున్నాయి. ఇదే సమయంలో పలు సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో రజనీ మేనియాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తలైవాకు జేజేలు పలుకుతున్నారు. ఈ దేశంలో ఇతర ప్రాంతాల అభిమానులది ఒక ఎత్తయితే తమిళనాట కొలువు తీరిన ఫ్యాన్స్ మాత్రం వెరీ డిఫరెంట్. నచ్చితే పూజిస్తారు. పూజలు చేస్తారు. పాలాభిషేకాలతో ఊపిరి ఆడకుండా చేస్తారు. నచ్చక పోయిందో ఇక కన్నీటి పర్యంతం అవుతారు..ఒక్కోసారి తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. ఆ ప్రాంతమే అంత. ఆ నీళ్లలో ఏమైనా మహత్తు ఉందో తెలియదు కానీ..సినిమా అంటే వాళ్లకు చచ్చేంత ఇష్టం.
Rajinikanth Comment About Jailer
అందుకే అక్కడ ఎక్కువగా క్రియేటివిటీ కలిగిన దర్శకులు వస్తున్నారు. వయసు మీద పడినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు ఆ మధ్య రజనీకాంత్. భిన్నమైన కథను ఎన్నుకున్నాడు. ఆయన కూడా ఆరంభంలో కష్టాలు పడ్డవాడే. అందుకే కండక్టర్ జాబ్ వదిలేసి కర్ణాటకను వదిలేసి తమిళనాడుకు వచ్చాడు. అతడిలోని నటనను ముందుగా గుర్తించింది మాత్రం దివంగత బాల చందర్. కమల్ హాసన్ కూడా తక్కువేమీ కాదు. ఒక్కో నటుడు ఒక్కో స్టైల్..పూర్తి కమ్యూనిస్టు , అంబేద్కర్ భావజాలంతో ఉన్న పా రంజిత్ తో సినిమా తీశాడు రజనీకాంత్(Rajinikanth). యంగ్ డైరెక్టర్లతో కథలు వింటున్నాడు. ఆపై నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. ఇంతకీ తలైవా సక్సెస్ కు కారణం ఏమిటి అని సినీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఆ మధ్యనే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. తిరిగి బయటకు వచ్చాడు. కోట్లాది మంది అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. తలైవా బ్రాండ్ వాల్యూ కోట్లకు మించి ఉండవచ్చు.
కానీ పూర్తిగా సాధారణ జీవితం అంటే ఇష్టపడే రజనీకాంత్ లో ఓ ప్రత్యేకమైన మనిషి ఉన్నాడు. అతడు ఎవరో కాదు ఓ భక్తుడు. అంతకు మించిన తాత్వికుడు. ఏడాదిలో ఎవరికీ చెప్పకుండా హిమాలయాల్లోకి వెళతాడు. అక్కడ ధ్యానం చేస్తాడు. తిరిగి వస్తాడు. మళ్లీ సినీ చర్చల్లో పాల్గొంటాడు. ఎక్కువగా మాట్లాడడు. ఆ వెంటనే మంత్రాలయానికి వెళతాడు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటాడు. నేల మీద కూర్చుంటాడు..ప్రసాదం తీసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు రజనీకాంత్(Rajinikanth). ఆయన ఎవరికీ అర్థం కాడు. ఎవరితోనూ దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేయడు. కుటుంబాన్ని అమితంగా ఇష్టపడే సూపర్ స్టార్ ..సమయం చిక్కితే పుస్తకాలు చదువుతాడు..వీలైనంత మౌనంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక 72 ఏళ్ల వయసు ఉన్న తలైవా సీక్రెట్ ఒక్కటే దేన్నీ ఆశించక పోవడం. మనసును కంట్రోల్ లో ఉంచుకోవడం. ఆదుర్దా చెందక పోవడం..దక్కిన వాటితోనే సంతృప్తి చెందడం..ఇదీ ఆయన సక్సెస్ ఫార్ములా..ఇదే తను సినిమాలో నటించేందుకు దోహదం చేస్తోంది. ఎంతైనా తలైవా వెరీ స్పెషల్ కదూ.
Also Read : Suriya Viral : సూర్య కంగువ సెన్సేషన్