Rajinikanth : తమిళ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ సెప్టెంబర్ 16న రాజమండ్రికి రానున్నారు. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పరామర్శించనున్నారు.
ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా తెలిపారు. నటుడిగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు తలైవా. ఇదే సమయంలో 45 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు చంద్రబాబు నాయుడు.
Rajinikanth Friendship With Chandra Babu Naidu
ఈ ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. ఇటీవల హైదరాబాద్ కు షూటింగ్ కు వచ్చిన సమయంలో రజనీకాంత్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆయనను ఘనంగా సత్కరించారు బాబు. తాజాగా స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్.
చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ తో ఫోన్ లో తలైవా మాట్లాడినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు మంచి స్నేహితుడని, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు రజనీకాంత్. విజయవాడలో జరిగిన 100 ఏళ్ల వేడుకలో రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read : Siddarth Luthra : Comment లూథ్రా ఆయుధం పట్టమంటే ఎలా