Rajiv Kumar : సీఈసీ చీఫ్ గా రాజీవ్ కుమార్
ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం
Rajiv Kumar : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుత కమిషనర్ గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఉంది. దీంతో ఆయన స్థానంలో సీఈసీ ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్(Rajiv Kumar) ను నియమించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
గతంలో రాజీవ్ కుమార్(Rajiv Kumar) కేంద్ర ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కు వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
గత ఏప్రిల్ నెలలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కొన్నేళ్లుగా దీనికి బాధ్యతలు చేపట్టారు. ఇక మోదీ ఏర్పాటు చేసిన థింక్ ట్యాంక్ (మేధావుల బృందం)లో కీలక వ్యక్తిగా ఉన్నారు.
ఈ థింక్ ట్యాంక్ అంటే మోదీకి సలహాలు, సూచనలు ఇచ్చే ప్రత్యేక టీం.
ఈ బృందంలోని సభ్యులకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అంతకు ముందు నీతి ఆయోగ్ కు పణగారియా ఉన్నారు. ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ వచ్చారు.
పలు కీలక మార్పులు చేయడంలో కీలక పాత్ర పోషించారు రాజీవ్ కుమార్(Rajiv Kumar).
ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ లు ఇవ్వడం, వాటి పనితీరును అంచనా వేయడం వెనుక ఆయన ముద్ర ఉంది.
నీతి ఆయోగ్ ఇచ్చే గ్రేడింగ్ మీదనే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మంజూరవుతాయి. ఇక రాజీవ్ కుమార్ పుణె లోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్స్ కి కులపతిగా పని చేశారు.
లక్నో లోని గిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవిపల్ మెంట్ స్టడీస్ కి బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా ఉన్నారు. మొత్తంగా ఆయనకు ఆర్థిక రంగమే కాదు రాజకీయ రంగంపై కూడా అనుభవం ఉంది. ఇది ఇప్పుడు సీఈసీకి పదవి చేపట్టేందుకు ఏర్పడింది.
Also Read : యూపీ పోలీస్ బాస్ పై వేటు