PBKS vs RR IPL 2022 : ఉత్కంఠ పోరాటం రాజ‌స్థాన్ విజ‌యం

మ‌రోసారి రెచ్చి పోయిన సిమ్రోన్ హిట్ మైర్

PBKS vs RR IPL 2022 : ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. చివ‌రి ఓవ‌ర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో ఉత్కంఠ నెల‌కొంది.

కానీ సిమ్రోన్ హిట్ మైర్ క్రీఈజులో ఉండి జ‌ట్టును గెలిపించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 189 ర‌న్స్ చేసింది. ఇక 190 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

జ‌ట్టు మేనేజ్ మెంట్ కొన్ని మార్పులు చేసింది. ప‌డిక్క‌ల్ ను మిడిల్ ఆర్డ‌ర్ కు తీసుకు వ‌చ్చింది. ఈసారి గ‌త మ్యాచ్ ల‌లో కాకుండా పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ప‌డిక్క‌ల్ ప్లేస్ లో య‌శ‌స్వి జైస్వాల్ ను ఓపెన‌ర్ గా దించింది.

ఆ ప్ర‌యోగం ఫ‌లించింది. ఏకంగా 68 రన్స్ చేశాడు. ప్రారంభంలోనే య‌ధావిధిగా జోస్ బ‌ట్ల‌ర్ ఈసారి 30 ర‌న్స్ దంచి కొట్టాడు. ఆత త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ 23 ర‌న్స్ మెరిపించాడు.

గత కొన్ని మ్యాచ్ ల‌లో విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చిన ప‌డిక్క‌ల్ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 31 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు(PBKS vs RR IPL 2022). మ‌రో వైపు హెట్ మైర్ 31 ర‌న్స్ చేసి ధాటిగా ఆడాడు.

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష దీప్ సింగ్ 2 వికెట్లు తీస్తే ర‌బాడా, రిషి ధ‌వ‌న్ చెరో వికెట్ తీసుకున్నారు(PBKS vs RR IPL 2022).

ఇక చివ‌రి ఓవ‌ర్ దాకా మ్యాచ్ కొన‌సాగింది. 6 బంతులు 8 ప‌రుగులు కావాల్సి ఉంది. వైడ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత హిట్ మైర్ సిక్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత సింగిల్ తీయ‌డంతో విజ‌యం స‌మ‌కూరింది.

 

Also Read : ఆ ఇద్ద‌రు స్పిన్న‌ర్లు అద్భుతం – భ‌జ్జీ

Leave A Reply

Your Email Id will not be published!