Rajya Sabha : కరోనా మహమ్మారితో కన్ను మూసిన దిగ్గజ గాయని గాన కోకిల లతా మంగేష్కర్ కు రాజ్యసభ నివాళులు అర్పించింది. ఆమె భారత దేశం గర్వించ దగిన మహోన్నతమైన గాయకురాలు అంటూ కొనియాడింది.
భారతరత్న మాత్రమే కాదు ఈ భువిపై వెలిసిన దైవ స్వరం అంటూ పేర్కొన్నారు రాజ్యసభ చైర్మన్(Rajya Sabha), ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆమెకు నివాళిగా సభా కార్యక్రమాలను గంట పాటు వాయిదా వేశారు.
లతా మంగేష్కర్ ను కోల్పోవడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.
75వ స్వాతంత్ర సంవత్సరంలో గాయక దిగ్గజం లతా మంగేష్కర్ మరణం విషాదకరం. యావత్ దేశం మౌనంగా ఉందని, ఆమెకు నివాళిగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య నాయుడు.
ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. భారతరత్న, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు, ది నైటింగేల్ , ది మెలోడీ క్వీన్ వంటి అనేక అవార్డులు అందుకున్నారు.
గత ఏడు దశాబ్దాలుగా లతా మంగేష్కర్ 20 భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారని తెలిపారు వెంకయ్య నాయుడు. లతాజీకి ఒక ప్రత్యేక నాణ్యత, సంక్లిష్టమైన సామర్థ్యం ఉంది.
ఆమె తన పాటలతో ఈ ప్రపంచంతో మిళితమైంది. మంత్రముగ్ధులను చేసేలా కళా ఖండాల సృష్టికి దారి తీసిందన్నారు. ఆమె చేసిన సేవలు గొప్పవని కొనియాడారు.
ఆమె పరోకారం గొప్పది. కుల, మతాలకు అతీతంగా పేద రోగుల వైద్య ఖర్చుల కోసం సహకరించారు. 1999 నుంచి 2005 దాకా రాజ్యసభకు నామినేట్ అయ్యారని గుర్తు చేశారు.
భారతీయ సంగీతానికే కాదు దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
Also Read : సినిమాలకు రాహుల్ రామకృష్ణ గుడ్ బై