Akasa Air Lines AOC : గ‌గ‌న వీధిలో ‘ఆకాశ ఎయిర్ లైన్స్’ కు ఓకే

రాకేశ్ ఝున్ఝున్ వాలాకు గుడ్ న్యూస్

Akasa Air Lines AOC : ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ గా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలాకు గుడ్ న్యూస్ చెప్పింది డీజీసీఏ. ఈ మేర‌కు ఆయ‌కు చెందిన ఆకాశ ఎయిర్ లైన్స్ కు క్లియ‌రెన్స్ ఇచ్చింది.

ఇదే విష‌యాన్ని ఆకాశ ఎయిర్ లైన్స్(Akasa Air Lines AOC) సంస్థ గురువారం సంతోషంతో ట్వీట్ చేసింది. ఇక నుంచి స్టాక్ మార్కెట్ లోనే కాదు గ‌గ‌న వీధిలో సైతం తాము టాప్ లో ఉంటామ‌ని అంటోంది.

ఈ మేర‌కు గాలి మోటార్ల‌ను న‌డిపేందుకు గాను ఎయిర్ ఆప‌రేట‌ర్ సర్టిఫికేట్ (ఏఓసీ) పొందిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌ను ప్రారంభించవ‌చ్చ‌ని తెలిపింది.

కొత్త‌గా ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థ‌ను రాకేశ్ ఝున్ ఝున్ వాలా ప్రారంభించారు. ఈ నెలాఖ‌రు లోగా త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించింది.

ఏఓసీ స‌ర్టిఫికెట్ పొంద‌డం మామూలు విష‌యం కాదు. ఇక మా సంస్థ మ‌రింత ముందుకు వెళ్లేందుకు ఇది దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొంది ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థ‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది.

త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఇది ఒక ముఖ్య‌మైన మైలురాయిగా పేర్కొంది. వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు ఇది దోహ‌దం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఏఓసీ వాణిజ్య‌, ర‌వాణా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించేందుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని తెలిపింది. ఏఓసీ మంజూరు అనేది డీజీసీఏ నిర్దేశించిన స‌మ‌గ్ర‌, క‌ఠిన‌మైన ప్ర‌కియ‌.

చివ‌రి ద‌శ‌, ఎయిర్ లైన్ కార్యాచ‌ర‌ణ సంసిద్ద‌త కోసం అన్ని నియంత్ర‌ణ , స‌మ్మ‌తి అవ‌స‌రాల‌ను సంతృప్తిక‌రంగా పూర్తి చేసిన‌ట్లు సూచిస్తుంద‌ని ఆకాశ ఎయిర్ లైన్స్ తెలిపింది.

మొద‌ట రెండు ఎయిర్ క్రాఫ్ట్ ల‌తో ప్రారంభిస్తామ‌ని ఆ త‌ర్వాత ప్ర‌తి నెలా మ‌రిన్ని విమానాల‌ను న‌డుపుతాని ప్ర‌క‌టించింది.

Also Read : అంకురాల‌కు గూగుల్ ఆలంబ‌న

 

 

 

Leave A Reply

Your Email Id will not be published!