Rakesh Tikait Comment : రైతుల‌ అల్టిమేటం దిగొస్తుందా కేంద్రం

మ‌హిళా రెజ్ల‌ర్ల కోసం క‌దం తొక్కిన రైత‌న్న‌లు

Rakesh Tikait Comment : సాగు చ‌ట్టాల‌పై క‌దం తొక్కిన్న రైత‌న్న‌లు మ‌రో పోరాటానికి సిద్దం కానున్నారా. అవున‌నే అంటున్నారు భార‌తీయ కిసాన్ యూనియ‌న్ జాతీయ అధికార ప్ర‌తినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait). వారు చేసిన అలుపెర‌గ‌ని పోరాటం దేశాన్ని క‌దిలించింది. చివ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని దిగి వ‌చ్చేలా చేసింది. ఆపై క్ష‌మాప‌ణ‌లు చెప్పేలా చేసింది. యావ‌త్ ప్ర‌పంచం రైత‌న్న‌ల స‌మిష్టి పోరాటాన్ని చూసి నివ్వెర పోయింది. చివ‌ర‌కు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేంత దాకా విశ్ర‌మించ‌లేదు. తాజాగా దేశాన్ని కుదిపేస్తున్నది మ‌హిళా రెజ్ల‌ర్ల స‌మ‌స్య‌. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 30 మందికి పైగా రోడ్డెక్కారు. గ‌త ఏప్రిల్ 23 నుంచి వారు ఆందోళ‌న బాట ప‌ట్టారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద సామూహిక నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు.

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ‌ను లైంగికంగా, శారీర‌కంగా, మాన‌సికంగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడంటూ వాపోయారు. ఆపై ఢిల్లీ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లారు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌మ‌ని. కానీ వాళ్లు ప‌ట్టించుకోలేదు. అక్క‌డి నుంచి భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ను ఆశ్ర‌యించారు. అక్క‌డ న్యాయం ల‌భించక పోయినా ఉప‌శ‌మ‌నం మాత్రం దొరికింది. సీజేఐ చంద్ర‌చూడ్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. వెంట‌నే పోలీస్ కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. దీంతో గ‌త్యంత‌రం లేక ఢిల్లీ ఖాకీలు రెండు కేసులు న‌మోదు చేశారు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌క‌టించారు.

ద‌మ్ముంటే నార్కో టెస్ట్ కు సిద్దం కావాల‌ని స‌వాల్ విసిరారు మ‌హిళా రెజ్ల‌ర్లు. అయితే తాను సిద్ద‌మేన‌ని మీరు కూడా సిద్ద‌మేనా అని డిమాండ్ చేశారు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌. ఆయ‌న చేసిన స‌వాల్ కు తాము సిద్ద‌మేన‌ని కానీ ఈ టెస్టులు బ‌హిరంగంగా జ‌ర‌గాల‌ని, దీనిని మీడియా అంతా అన్ని చాన‌ళ్లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌ని డిమాండ్ చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. ఇదే స‌మ‌యంలో మే 28న ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా మార్చ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ర్యాలీగా బ‌య‌లు దేరిన మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను ఇష్టానుసారం కొట్టారు. ఈడ్చుకు వెళ్లారు. మ‌గ పోలీసులు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. వీరి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌నను చూసి దేశం యావ‌త్తు నిర‌స‌న వ్య‌క్తం చేసింది.

దీంతో మ‌హిళా రెజ్ల‌ర్లు త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగ‌లో నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది క‌ల‌క‌లం రేపింది. విష‌యం తెలుసుకున్న ఎస్కేయూ నేత న‌రేష్ టికాయ‌త్(Naresh Tikait) వారిని అడ్డుకుని స‌ముదాయించారు. ఐదు రోజుల గ‌డువు ఇచ్చారు కేంద్రానికి. ఈ సంద‌ర్భంగా మ‌హా పంచాయ‌త్ చేప‌ట్టారు. ఇందులో సంచ‌ల‌న తీర్మానం చేశారు. కేంద్రానికి జూన్ 9 వ‌ర‌కు డెడ్ లైన్ విధించారు అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait). ఆరోజు వ‌ర‌కు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను అరెస్ట్ చేయాల‌ని లేక పోతే దేశ వ్యాప్తంగా ఉద్య‌మం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కేంద్రం మౌనంగా ఉంటుందా లేక దిగి వ‌స్తుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : Sameer Wankhede

Leave A Reply

Your Email Id will not be published!