Rakesh Tikait : భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.
విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియ చేశారు. ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అనే గొప్ప పండుగలలో ప్రజల నిర్ణయమే ప్రధానమని, వారే అంతిమ నిర్ణేతలనని పేర్కొన్నారు.
ఈ తరుణంలో సాగు చట్టాలకు సంబంధించి రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించడంలో ఈరోజు వరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు.
కొత్తగా కొలువు తీరే ప్రభుత్వాలు రైతులు, కూలీల అభ్యున్నతికి కృషి చేయాలని రాకేశ్ తికాయత్ (Rakesh Tikait )కోరారు. రైతులు, కూలీలు, పేద ప్రజలు లేకుండా ఏ ప్రభుత్వం మనజాలదని స్పష్టం చేశారు.
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు తికాయత్
ఈ రోజు వరకు కేసులు మాఫీ చేయలేదని మండిపడ్డారు. ఇకనైనా సర్కార్లు మారాలని లేక పోతే మరోసారి రైతులు పోరాటానికి దిగుతారని హెచ్చరించారు రాకాశ్ తికాయత్.
రైతులను ఆదుకునేందుకు యుద్ద ప్రాతిపదికన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే ఏ ప్రయత్నాన్ని తాము ఒప్పు కోబోమంటూ మరోసారి స్పష్టం చేశారు రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్.
Also Read : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం