Rakesh Tikait : నిన్ను చూసి దేశం గర్విస్తోంది – టికాయత్
నీరజ్ చోప్రాకు రైతు నేత అభినందన
Rakesh Tikait : ఎంత లక్ష్యం పెద్దదైనా గురి పెడితే తల వంచక మానదు. ఆచరణలో చేసి చూపించిన మొనగాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఆదివారం ప్రపంచ ఛాంపియన్ షిప్ జావెలిన్ త్రో పోటీలో తృటిలో బంగారు పతకాన్ని పోగొట్టుకున్నాడు.
రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. దీంతో యావత్ భారతమంతా సంబురాలలో మునిగి తేలుతోంది. ప్రధానంగా నీరజ్ చోప్రా స్వంతూరు హర్యానాలోని పాని పట్ లో పండగ వాతావరణం నెలకొంది.
దేశంలోని ప్రముఖులంతా నీరజ్ చోప్రా(Neeraj Chopra) కు జేజేలు పలుకుతున్నారు. ఈ తరుణంలో ప్రముఖ రైతు నాయకుడు , భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ స్పందించాడు.
నీరజ్ చోప్రా సాధించిన విజయాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపాడు. ప్రత్యేకంగా చరిత్ర సృష్టించినందుకు అభినందనలు తెలియ చేశాడు. నీ లాంటి వాళ్లు ఈ దేశానికి అవసరమని పేర్కొన్నాడు.
శ్రమిస్తే విజయం నీ బానిస అవుతుందని ఆచరణలో చేసి చూపించాడని కొనియాడారు రాకేశ్ టికాయత్. రైతులందరి తరపున నీరజ్ చోప్రాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait) .
ఈ సందర్భంగా ఆయన ఓ పేరొందిన కవితను కూడా ప్రస్తావించారు. నేను ఇలాంటి బిలియన్ల అంచనాలను నిజం చేశాను. నేను ఆత్మ ను దాటుకుని ఈటెను బలంగా విసిరాను. చివరకు లక్ష్యాన్ని ఛేదించాను. నేను ఎప్పటికీ లొంగను అని.
మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
Also Read : పాండ్యాపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
"अरबों उम्मीदों को कुछ यूँ संभाला मैंने
जज्बा रखा और फेंक दिया भाला मैंने"
रजत पदक जीतने पर नीरज चोपड़ा को हार्दिक शुभकामनाएं।@neerajchopra023🇮🇳@ANI @news24tvchannel @PTI_News pic.twitter.com/V8P9mq4JoK— Rakesh Tikait (@RakeshTikaitBKU) July 24, 2022