Rakesh Tikait : కేంద్రంపై రాకేశ్ తికాయ‌త్ ఫైర్

టీఆర్ఎస్ దీక్ష‌లో రైతు నేత

Rakesh Tikait  : భార‌తీయ కిసాన్ యూనియ‌న్ జాతీయ అధికార ప్ర‌తినిధి, రైతు ఉద్య‌మ అగ్ర నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ (Rakesh Tikait ) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేప‌ట్టిన ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి తికాయ‌త్ హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా తికాయ‌త్ మాట్లాడారు. రైతుల ప‌ట్ల మోదీ స‌ర్కార్ వివ‌క్ష కొన‌సాగించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇవాళ రైతుల కోసం ఆందోళ‌న చేప‌ట్ట‌డం సిగ్గు చేటుగా అభివ‌ర్ణించారు.

రైతుల‌పై ఎలాంటి వ‌త్తిళ్లు ప‌ని చేయ‌వ‌న్నారు. ఇది నిరూపిత‌మైంద‌ని చెప్పారు. దేశంలో ఏం జ‌రుగుతుందో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి తెలుసా అని ప్ర‌శ్నించారు. రైతులు ఇంకా చ‌ని పోతూనే ఉండాలా అని ప్ర‌శ్నించారు.

దేశంలో రైతులు త‌మ హ‌క్కులు సాధ్యం అయ్యేంత వ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait ). రైతులు పండించిన ధాన్యం కోసం టీఆర్ఎస్ పోరాటం చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేక పోయిన‌ట్ల‌యితే దేశంలోని రైతులంతా ఒకే వేదిక‌పైకి మ‌రోసారి వ‌స్తార‌ని హెచ్చ‌రించారు రాకేశ్ తికాయ‌త్.

కేంద్రం రైతుల‌ను ఉద్దరిస్తున్న‌ట్లు మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆందోళ‌న చేప‌ట్టార‌ని చెప్పారు.

రైతుల కోసం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఉద్య‌మిస్తున్నార‌ని చెప్పారు రాకేశ్ తికాయ‌త్. రైతుల కోసం ఎవ‌రు పోరాటం చేసినా త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు తికాయ‌త్.

Also Read : ‘ఠాకూర్’ సార‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారం

Leave A Reply

Your Email Id will not be published!