Ram Gopal Varma : భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). మూస ధోరణిలో వెళుతున్న సినిమా రంగంలో ఒకే ఒక్క సినిమాతో అంతా తన వైపు తిప్పుకునేలా చేసుకున్నాడు ఆర్జీవీ. అదే నాగార్జున నటించిన శివ చిత్రం. ఆ తర్వాత తీసిన సినిమాలు తన ప్రతిభను తెలియ చేశాయి. సినిమాకు సంబంధించిన 24 ఫ్రేమ్స్ గురించి అద్భుతంగా చెప్పే అతి కొద్ది మంది దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.
Ram Gopal Varma Vibe
ఆయన బాలీవుడ్ లో తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వర్మ కంపెనీలో చాలా మంది టెక్నిషియన్లు శిక్షణ పొందారు. ఇవాళ నటులుగా, దర్శకులుగా, ఇతర సాంకేతిక నిపుణులుగా టాప్ లో ఉన్నారు. దీనికంతటికీ ఆయనే కారణం అంటారు వారంతా.
కానీ ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఫోటోలు పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో మరింత ఆసక్తిని రేపింది. ప్రపంచం అంతా ఎక్కడో లేదు..స్త్రీలో ఉంది అంటూ క్యాప్షన్ జత చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ ఏది చేసినా..ఏది రాసినా అది క్షణాల్లో వైరల్ కావడం విశేషం. ఇదీ ఆయన స్పెషాలిటీ.
Also Read : Priyanka Chaturvedi : ప్రశ్నించడమే నేరమా – ప్రియాంక