Ram Gopal Varma : లూథ్రా కత్తి పట్టమంటే ఎలా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma : హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి రెచ్చి పోయారు. నర్మ గర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఇవాళ తీవ్రంగా స్పందించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది. జడ్జి హిమ బిందు సంచలన తీర్పు చెప్పారు. 14 రోజుల రిమాండ్ విధించారు చంద్రబాబు నాయుడుకు.
Ram Gopal Varma Sensational Comments
ఆమె ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. సుప్రీంకోర్టులో పేరు పొందిన లాయర్ సిద్దార్థ్ లూథ్రా నారా చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపించారు. కానీ చంద్రబాబును జైలుకు వెళ్లకుండా కాపాడలేక పోయారు. భారీ ఎత్తున ఫీజు చెల్లించినట్లు జోరుగా ప్రచారం జరిగింది.
లూథ్రా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopla Varma). న్యాయ పరమైన ఎదురు దెబ్బ తగిలింది. మీరు సర్వోన్నత న్యాయ స్థానానికి సీనియర్ న్యాయవాదిగా ఉన్నందు వల్ల మీరు ప్రతిజ్ఞ చేసిన న్యాయ వ్యవస్థపై హింసను బోధించడం చూసి ఆశ్చర్య పోయానని పేర్కొన్నారు ఆర్జీవీ.
జడ్జీలు మీ భయంకరమైన ప్రక్రియను గమనించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు దర్శకుడు.
Also Read : Pawan Kalyan : పవన్ బాబు భేటీపై ఉత్కంఠ