Ram Mandir Comment : రామ మందిరం ప్రచార అస్త్రం
సార్వత్రిక ఎన్నికలకు ఆయుధం
Ram Mandir Comment : దేశంలో ఎప్పుడు దేనిని ప్రచార అస్త్రంగా వాడుకోవాలో భారతీయ జనతా పార్టీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదంటే నమ్మలేం. ఇది వాస్తవం కూడా. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలో కాషాయం ఆక్టోపస్ లాగా విస్తరించింది. అయోధ్యలో కోట్లాది ప్రజలు నిత్యం ఆరాధించే రామ మందిరం(Ram Mandir) నిర్మాణం నభూతో నభవిష్యత్ అన్న చందంగా తయారవుతోంది.
భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు కేసులు నడిచాయి. చివరకు లైన్ క్లియర్ చేయడంతో రామ మందిరం రూపు దిద్దుకుంటోంది. అయోధ్య రాముడిదే అంటూ ఆనాడు ఎల్ కే అద్వానీ చేపట్టిన రథ యాత్ర ఊహించని రీతిలో దేశంలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు దోహద పడింది.
ఇందుకు దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ , విశ్వ హిందూ పరిషత్ , ఏబీవీపీ దోహద పడేలా చేశాయి. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత్ జోడో యాత్ర పేరుతో శ్రీకారం చుట్టారు. త్వరలో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ చరిత్ర సృష్టించింది.
అత్యధిక విజయాలు నమోదు చేసింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయింది. మరోవైపు గత 15 ఏళ్లుగా పవర్ లో కొనసాగుతూ వచ్చిన దేశ రాజధాని ఢిల్లీ మహానగర పాలిక ఎన్నికల్లో కేవలం 104 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ ఆప్ 134 సీట్లను కైవసం చేసుకుని చెక్ పెట్టింది. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇక త్రిపురలో జెండా ఎగుర వేయాలని అనుకుంటోంది.
వీటన్నింటిని సెమీ ఫైనల్ గా భావిస్తోంది బీజేపీ. ఈ తరుణంలో గురువారం త్రిపుర వేదికగా ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. అయోధ్య లో పునర్ నిర్మిస్తున్న రామ మందిరాన్ని(Ram Mandir) జనవరి 1, 2024న ప్రారంభిస్తామని వెల్లడించారు. అంటే టార్చ్ బేరర్ చేసిన ఈ కామెంట్స్ తమ వ్యూహం ఏమిటో చెప్పకనే చెప్పారు.
అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రామ మందిరాన్ని తాము ప్రారంభించామని చెబుతూ ఎన్నికల్లోకి వెళుతుంది. సో ఓ వైపు రాహుల్ గాంధీ దేశానికి మతం కాదు కావాల్సింది ప్రేమ కావాలని కోరుతుంటే బీజేపీ మాత్రం రామ మందిరం తమ ప్రచార అస్త్రం అని అంటోంది. ఏది ఏమైనా మతం అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది.
దీనిని ఎవరూ కాదనలేం. అమిత్ షా ఏది మాట్లాడినా దాని వెనుక బిగ్ స్కెచ్ ఉంటుందనేది అర్థమైంది. ఎవరు ఏమిటనేది రాబోయే కాలం సమాధానం చెబుతుంది.
Also Read : నితీష్ సమాధాన్ యాత్ర షురూ