Ramabai Ranade : మరాఠా అంటేనే పోరాటానికి ధిక్కార స్వరానికి ప్రతీక. ఇక్కడి నుంచే ఛత్రపతి శివాజీ పుట్టారు. ఇక్కడి నుంచే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మించారు.
ఈ మట్టి నుంచే జ్యోతి బా పూలే , సావిత్రి బాయి పూలే లాంటి మహోన్నతమైన వ్యక్తులు నడియాడారు.
ఈ మట్టిపైనే మరో యోధురాలు జన్మించారు. ఆమె 19వ శతాబ్దపు మొదటి మహిళా హక్కుల కార్యకర్తగా పేరొందారు రమాబాయి రనడే(Ramabai Ranade).
ఇవాళ ఆమె జయంతి. 1862 జనవరి 25న మహారాష్ట్రలోని సాంగ్లిలో పుట్టారు రనడే. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
మహిళలు కూడా మనుషులేనని, వారికి హక్కులు ఉంటాయని, వారికి చదువు కోవడం అన్నది ప్రాథమిక హక్కు అని నినదించారు రమాబాయి రనడే.
ఆనాడు భారత దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం కోసం రమాబాయి రనడే (Ramabai Ranade)పోరాడారు. సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు యుద్దం చేశారు.
సామాజిక కార్యకర్తగా తనను తాను నిరూపించుకున్నారు. ఆమె పూర్తి పేరు యమునా కుర్లేకర్.
11 ఏళ్ల వయసులో ప్రముఖ భారతీయ పండితుడు, సామాజిక సంస్కర్త అయిన జస్టిస్ మహాదేవ రనడేను పెళ్లి చేసుకున్నారు.
ఆమె భర్త సమాజంలో నెలకొన్న అంటరానితనం, బాల్య వివాహం, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు.
సామాజిక అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు.
ఆయన ఆలోచనలు, సామాజిక నిబద్దత, సేవా గుణం రమాబాయిని ఎంతగానో ప్రభావితం చేశాయి.
తన భర్త రనడే ప్రోత్సాహంతో చదవడం, రాయడం నేర్చుకుంది. మరాఠీతో మొదలు పెట్టి ఇంగ్లీష్, బెంగాలీ లో ప్రావీణ్యం సంపాదించింది.
మహిళల గురించి తన గొంతు విప్పింది. ముంబైలో హిందూ లేడీస్ సోషల్ క్లబ్ ను ఏర్పాటు చేసింది. పూణేలో సేవా సదన్ సొసైటీని స్థాపించింది. తన జీవితాన్ని మహిళల అభివృద్ది కోసం అంకితం చేసింది.
1886లో పుణెలో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను స్థాపించింది. మరాఠా యోధురాలిని ఎల్లప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంది.
Also Read : మెతక వైఖరి కొంప ముంచిందా