Salman Butt : రమీజ్ రజా కామెంట్స్ భట్ సీరియస్
కోహ్లీని తక్కువ చేసి మాట్లాడితే ఎలా
Salman Butt : ప్రపంచ క్రికెట్ లో అత్యంత పాపులర్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు ఆయన మాజీ కూడా. మెమోరబుల్ కామెంటేటర్ గా కూడా వినుతికెక్కాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా కొనసాగుతున్నాడు రమీజ్ రజా. ప్రస్తుతం ఆయన పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్నాయి.
ప్రధానంగా క్రికెట్ అంటేనే భారత్ అన్నంతగా మారి పోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ను శాసిస్తున్నది ఇండియానే. వరల్డ్ వైడ్ గా చూస్తే అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో టాప్ మూడింట్లో బీసీసీఐ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దానికి ఎంత పవర్ ఉందో.
ఇక బీసీసీఐ బాస్ గా ఉన్న గంగూలీ , రమీజ్ రజా(Ramiz Raja) ఫ్రెండ్స్ అయినా భారత, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరు జట్ల మధ్య ఇరు దేశాలలో క్రికెట్ మ్యాచ్ లకు ఆస్కారం లేకుండా పోయింది. కేవలం తటస్థ వేదికల మీద మాత్రమే ఆడేందుకు వీలు కలుగుతోంది.
ఇక ఆసియా కప్ లో ఘోరమైన ప్రదర్శన చేపట్టింది భారత్. ఇక పాకిస్తాన్ ఫైనల్ కు వెళ్లినా లంకేయుల దెబ్బకు రన్నరప్ గా మాత్రమే నిలిచింది. ఇదిలా ఉండగా ఆఫ్గనిస్తాన్ పై కోహ్లీ సెంచరీ చేసినా భారత్ ఆశించిన మేర రాణించ లేదు. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదిలా ఉండగా బాబర్ ఆజమ్ సెంచరీ చేసినా పట్టించు కోవడం లేదని కానీ కోహ్లీ ఆడితే మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్(Salman Butt) సీరియస్ గా స్పందించాడు.
రమీజ్ రజా అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం, కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదని సూచించాడు.
Also Read : బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ..?