Ramiz Raja Najam Sethi : వకార్..హక్ తొలగింపుపై రమీజ్ ఫైర్
అడిగే హక్కు ఉందన్న పీసీబీ మాజీ చీఫ్
Ramiz Raja Najam Sethi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ చైర్మన్ గా తనకు ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేశారు. మిస్బా ఉల్ హక్ తో పాటు వకార్ యూనిస్ ను అకారణంగా తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పీసీబీ చైర్మన్ సేథీపై నిప్పులు చెరిగాడు రమీజ్ రజా.
వకార్ యూనిస్ 2021కి ముందు కోచింగ్ స్టాఫ్ నుండి వకార్ , హక్ లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా నజామ్ సేథీని నియమించినప్పటి నుండి రమీజ్ రజా(Ramiz Raja) కొన్ని అద్బుతమైన విషయాలు వెల్లడించాడు.
ఇది చాలా చర్చనీయాంశమైన ఆసియా కప్ అంశం కావచ్చు లేదా బోర్డులో కొన్ని మార్పులు జరిగిన విధానం కావచ్చు. ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు రమీజ్ రజా. పాకిస్తాన్ టీవీ ఛానల్ తో బుధవారం రమీజ్ రజా మాట్లాడాడు. క్రికెట్ బోర్డు నుంచి తనను ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.
మిస్బా ఉల్ హక్ , వకార్ యూనిస్ లను ఏ కారణంతో తొలగించారో తనకు అర్థం కాలేదన్నారు. వాళ్లు గత కొంత కాలంగా పాకిస్తాన్ జట్టుకు సేవలు అందిస్తూ వచ్చారని పేర్కొన్నాడు రమీజ్ రజా(Ramiz Raja). వ్యక్తిగతంగా నాపై ద్వేషం పెట్టుకుని మిగతా ఆటగాళ్లను బలి చేస్తారా అంటూ ప్రశ్నించాడు.
ఇదిలా ఉండగా మిస్బా, వకార్ లను తొలగించి వారి స్థానంలో సక్లైన్ ముస్తాక్ ను ప్రధాన కోచ్ గా , అబ్దుల్ రజాక్ లను బౌలింగ్ కోచ్ లుగా నియమించారు. సమా టీవీతో రమీజ్ రజా మాట్లాడాడు.
Also Read : పోరాడిన శ్రీలంక గెలిచిన భారత్