Ramiz Raja IPL : పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ ప‌వ‌ర్ ఫుల్

పీసీబీ చైర్మ‌న్ అండ్ సిఇఓ ర‌మీజ్ ర‌జా

Ramiz Raja IPL  : ప్ర‌పంచంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన రిచ్ లీగ్ గా పేరొందింది ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్. అయితే దీనికి ధీటుగా పాకిస్తాన్ కూడా లీగ్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది.

బీసీసీఐ నిర్వ‌హించిన ఐపీఎల్ పై పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఇఓ క‌మ్ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja IPL )సంచల‌న కామెంట్స్ చేశారు. ఐపీఎల్ గురించి అవాకులు చెవాకులు పేలారు.

దీనిపై స‌ర్వ‌త్రా దాడి మొద‌లైంది. ఇప్ప‌టికే ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోస‌మే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. ఏకంగా రూ. 50 వేల కోట్లు రానుంద‌ని బీసీసీఐ అంచ‌నా వేసింది.

ఐపీఎల్ కు ధీటుగా తాము నిర్వ‌హిస్తామ‌ని చెప్ప‌డాని, త‌క్కువ చేసి మాట్లాడ‌టాన్ని తాను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు ర‌మీజ్ ర‌జా(Ramiz Raja IPL ).

అవును భార‌త దేశ ఆర్థిక వ్యవ‌స్థ గురించి త‌న‌కు తెలుస‌ని, ఇదే స‌మ‌యంలో బీసీసీఐ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌లోనే టాప్ లో ఉంద‌న్నారు. దీనికి అక్క‌డి ప‌రిస్థితులు అనుకూలించాయ‌ని పేర్కొన్నారు.

తాము కూడా క్రికెట్ ను మ‌రింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని తెలిపాడు రమీజ్ ర‌జా. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం పీసీబీ ప‌రిస్థితి బాగో లేదు.

ఆర్థికంగా స్వ‌తంత్రంగా ఉండేందుకు తాము కొత్త ఆస్తుల‌ను సృష్టించాల‌ని స్ప‌స్టం చేశాడు. ప్ర‌స్తుతం పీఎస్ఎల్ , ఐసీసీ నిధులు త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నాడు.

వ‌చ్చే ఏడాది నుంచి వేలం పాట నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నామ‌న్నాడు ర‌మీజ్ ర‌జా. పీఎస్ఎల్ ను వేలం పాట‌కు పెడితే డ‌బ్బులు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నాడు.

Also Read : స‌మ ఉజ్జీల స‌మ‌రం ఎవ‌రిదో విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!