Ramiz Raja BCCI : బీసీసీఐపై భ‌గ్గుమ‌న్న ర‌మీజ్ రజా

ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై కామెంట్

Ramiz Raja BCCI : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా మ‌రోసారి నోరు పారేసుకున్నాడు. బీసీసీఐపై సీరియ‌స్ అయ్యాడు. త‌మ‌కే ఎందుకు ప్ర‌యారిటీ ఇవ్వాలంటూ ప్ర‌శ్నించాడు. ఓ వైపు ఇంగ్లండ్ పాకిస్తాన్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు మొద‌టి మ్యాచ్ లో గెలుపొందింది. ఇక వ‌చ్చే ఏడాది రెండు మెగా టోర్నీలు ఆసియా ఖండంలో జ‌ర‌గ‌నున్నాయి.

ఒక‌టి పాక‌స్తాన్ లో ఆసియా క‌ప్ రెండోది భార‌త్ లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ . భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ , బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ప్ర‌క‌టించాడు. దీంతో ర‌మీజ్ ర‌జా(Ramiz Raja) స్పందిస్తూ మీరు గ‌నుక రాక పోతే తాము వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడబోమంటూ స్ప‌ష్టం చేశాడు.

దీనిపై నిప్పులు చెరిగారు భార‌త దేశ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. మీరు రాకున్నా త‌మ‌కు ఏమీ కాద‌ని, మీరే కోట్లు న‌ష్ట పోతారంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌పంచంలోని ఏ జ‌ట్టు అయినా స‌రే టీమిండియాతో ఆడాల‌ని అనుకుంటుంద‌ని పేర్కొన్నాడు. ఈ త‌రుణంలో ఆసియా క‌ప్ ను పాకిస్తాన్ లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌గా నిర్వ‌హిస్తే తాము ఆలోచిస్తామ‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయ‌ని ఈ త‌రుణంలో తాము ఆట‌గాళ్ల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌లేమ‌ని పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్. దీంతో ర‌మీజ్ ర‌జా మ‌రోసారి స్పందిస్తూ.. త‌మ‌కే ఎందుకు అంత మొద‌టి ప్ర‌యారిటీ ఇవ్వాలంటూ వింత ప్ర‌శ్న వేశాడు. ప్ర‌స్తుతం ర‌మీజ్ ర‌జా చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : స్పెయిన్ ప‌రేషాన్ మొరాకో సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!