Ramiz Raja Najam Sethi : నా వస్తువుల్ని తీసుకోనీయ లేదు
పీసీబీ చైర్మన్ నజామ్ సేథీపై రమీజ్ ఫైర్
Ramiz Raja Najam Sethi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన హయాంలో ఏరికోరి రమీజ్ ను చైర్మన్ గా నియమించారు. ఇదే సమయంలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోవడంతో షెహబాజ్ షరీఫ్ పీఎంగా కొలువు తీరారు. ఆనాటి నుంచే రమీజ్ రజాను తొలగిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా రజాను తొలగిస్తూ నజామ్ సేథీని(Ramiz Raja Najam Sethi) పీసీబీకి చైర్మన్ గా నియమించారు పీఎం.
ఇదిలా ఉండగా తాను చైర్మన్ గా ఉన్న సమయంలో తనకు సంబంధించిన వస్తువులను తీసుకు వెళ్లేందుకు ప్రస్తుతం పీసీబీ చీఫ్ నజామ్ సేథీ అనుమతించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రమీజ్ రజా(Ramiz Raja) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
బలి పశువును చేశారని, ప్రతీకారం ఇలా తీర్చుకున్నారంటూ మండిపడ్డారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు రమీజ్ రజా. నజామ్ సేథీ నియామకం ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పీసీబీని నాశనం చేయడం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.
వారు పూర్తిగా పీసీబీ నియమాలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఒక సీజన్ మధ్యలో చీఫ్ సెలెక్టర్ ను కూడా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రమీజ్ రజా. రాత్రి 2 గంటలకు తాను ఆఫీసు నుంచి వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు. మూడేళ్ల కాలపరిమితి ఉంది. కానీ 12 నెలలోనే వైదలొగాలని కోరారని తెలిపాడు. ఇదే సమయంలో సేథీకి ఎలాంటి అవగాహన లేదన్నారు. క్రికెట్ తో ఆడిన అనుభవం కూడా లేదని ధ్వజమెత్తారు.
Also Read : క్రిస్మస్ వేడుకల్లో కీవీస్ ప్లేయర్స్