Ranil Wickremesinghe : శ్రీలంక ప్రధానిగా రనీల్ విక్రమ సింఘే
ప్రస్తుతం యునైటెడ్ నేషనల్ పార్టీ చీఫ్
Ranil Wickremesinghe : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకాన పడింది. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో తల్లడిల్లుతోంది. ద్వీప దేశం నానా తంటాలు పడుతోంది. ఆహారానికి, ఆయిల్ కు తిప్పలు పడుతోంది.
జనం రోడ్లపైకి వచ్చారు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన తప్పించుకునేందుకు వీలు లేకుండా, దేశం విడిచి పారి పోకుండా శ్రీలంక అత్యున్నత న్యాయ స్థానం నిషేధం విధించింది. శ్రీలంక ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం మహింద రాజపక్సేనంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
విపక్షాలు సైతం తీవ్రంగా మండి పడుతున్నాయి. ఇదిలా ఉండగా మొత్తం పదవులలో అధిక శాతం రాజపక్సే కుటుంబీకులే ఉండడంతో ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
అనిశ్చితి పరిస్థితి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో మహింద మద్దతుదారులు రెచ్చి పోయారు. ప్రభుత్వ వ్యతిరేకులపై దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘర్షణల్లో ఇప్పటి దాకా 9 మందికి పైగా మరణించారు. ఇక ప్రాణ భయంతో శ్రీలంక నేవీ స్థావరంలో తలదాచుకుంది మాజీ ప్రధానితో పాటు ఆయన కుటుంబం. విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆయన ఎక్కడికీ వెళ్లకుండా కాపలా కాస్తున్నారు.
ఇప్పటికే నిరసనకారుల చేతుల్లో అధికార ఎంపీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరుణంలో శ్రీలంకలో మళ్లీ యథాతథ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే తదుపరి ప్రధాన మంత్రిగా యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడు రనీల్ విక్రమ సింఘేను(Ranil Wickremesinghe) ఎన్నుకోనున్నట్లు టాక్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.
Also Read : ‘మహింద’ దేశం విడిచి వెళ్లొద్దు – కోర్టు