Jay Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీని ఈ సీజన్ లోనే రెండు దశల్లో నిర్వహిస్తామని ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah) .
ఈ విషయాన్ని ఇవాళ ధ్రువీకరించారు. లీగ్, స్టేజ్ మ్యాచ్ లన్నీ మొదటి దశలోనే జరుగుతాయని తెలిపారు. రెండో దశల్లో నిర్వహించాలని బీసీసీఐ బోర్డు నిర్ణయించింది.
మొదటి దశలో జూన్ లో నాకౌట్ లు జరగనుండగా లీగ్ దశలోని అన్ని మ్యాచ్ లను పూర్తి చేయాలని తాము భావిస్తున్నామన్నారు జే షా. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని(Jay Shah) వెల్లడించారు.
రెడ్ బాల్ తో నే మ్యాచ్ లు జరుగుతాయని హింట్ ఇచ్చారు. దేశీవాళి క్రికెట్ లో రంజీ ట్రోఫీ అత్యంత ముఖ్యమైన టోర్నీ. దీనిని ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. కాక పోతే కరోనా కారణంగా బిసీసీఐ నిర్దేశించిన షెడ్యూల్స్ అన్నీ మారుతూ వస్తున్నాయి.
ఈ టోర్నీ ద్వారా ప్రతిభ కలిగిన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. మరో వైపు ఐపీఎల్ ద్వారా కూడా దమ్మున్న కుర్రాళ్లు తమ సత్తా చాటుతున్నారు. బీసీసీఐ ఈసారి రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్దమైంది.
ఎలాగైనా సరే చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో రంజీ ట్రోఫీ గురించి కీలక కామెంట్స్ చేశారు భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. భారత క్రికెట్ జట్టుకు రంజీ అత్యంత ముఖ్యమైన లీగ్ గా పేర్కొన్నాడు.
దానిని విస్మరిస్తే ఆటకు మంచిది కాదని సూచించాడు బీసీసీఐకి.
Also Read : మీరు ఇస్తానంటే నేను వద్దంటానా