Film Fare Awards 2022 : ఘనంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానం
ఉత్తమ నటీనటులుగా రణ్ వీర్..సనన్
Film Fare Awards 2022 : ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది ఫిల్మ్ ఫేర్ అవార్డుల(Film Fare Awards 2022) కార్యక్రమం. 2022 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా రణ్ వీర్ సింగ్ , ఉత్తమ నటిగా కృతి సనన్ స్వీకరించారు.
అవార్డును స్వీకరిస్తున్న సందర్భంగా రణ్ వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనే తో కలిసి వేదికను పంచుకున్నారు. ప్రస్తుతం జరిగన ఈ అవార్డుల ఉత్సవం 67వది కావడం విశేషం.
రణ్ వీర్ సింగ్ ఆనాటి 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తీసిన 83 మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. ఇక కృతి సనన్ మిమి మూవీలో స్త్రీ ప్రధాన పాత్రలో నటించినందుకు గాను అవార్డును తీసుకుంది.
ఇక ఫిల్మ్ ఫేర్ కంటే ముందు ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం -2022 లో 83 మూవీకి గాను రణ్ వీర్ సంగ్ కు ఉత్తమ అవార్డు దక్కింది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో 83 భారత దేశానికి చెందిన చారిత్రాత్మక 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్
వరల్డ్ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించాడు.
ఇక ఉత్తమ నటిగా ఎంపికైన కృతి సనన్ మిమి మూవీలో అద్దె తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
అంతకు ముందు మే 2022లో కృతి సనన్ తన కెరీర్ లో మొదటి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అది కూడా అబుదాబిలో జరిగిన 22వ
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్సు లో తీసుకుంది.
రణ్ వీర్ , కృతి సనన్ తో పాటు విక్కీ కౌశల్, అసిస్ కౌర్ , బి ప్రాక్ , విద్యా బాలన్ , విష్ణు వర్దన్ , పంకజ్ త్రిపాఠి వంటి ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు.
Also Read : దిల్జిత్ దోసాంజ్ ‘జోగి’ ట్రైలర్ సూపర్
#KritiSanon wins Filmfare Award for Best Actor in a Leading Role (Female) at the 67th #Wolf777newsFilmfareAwards 2022 for his performance in #Mimi. #FilmfareAward2022 #FilmfareAwardhttps://t.co/EBU8TBTNK8
— Filmfare (@filmfare) August 30, 2022
Love! ❤️#DeepikaPadukone shared a victory post for #RanveerSingh as he won the Award for Best Actor in a Leading Role (Male) for #83 at the 67th #Wolf777newsFilmfareAwards 2022 with Government Of Maharashtra, Azaadi Ka Amrit Mahotsav.#FilmfareAwards #FilmfareAwards2022 pic.twitter.com/sqUEKJrMhb
— Filmfare (@filmfare) August 31, 2022