Ranveer Singh : ర‌ణ‌వీర్ సింగ్ బిగ్ పిక్చ‌ర్ సూప‌ర్

ఆక‌ట్టుకుంటున్న కాజ‌ల్, క‌ర‌ణ్

Ranveer Singh : బుల్లితెర పై ర‌ణ‌వీర్ సింగ్ దుమ్ము రేపుతున్నాడు. ఆయ‌న ప్ర‌ముఖ టీవీ చాన‌ల్ క‌ల‌ర్స్ టీవీలో బిగ్ పిక్చ‌ర్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది.

దీనికి ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. షో గ్రాండ్ ఫినాలే ప్రోమో వీడియో లో క‌ర‌ణ్ జోహార్ , కాజోల్ త‌ళుక్కున మెరిసారు.

ఇదిలా ఉండ‌గా ర‌ణ్ వీర్ సింగ్ వీరిద్ద‌రినీ స‌ర‌దాగా ప‌రిచయం చేశారు. భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కే దిగ్గ‌జాలు అంటూ కితాబు ఇచ్చాడు. ఫ్యామిలీ ఎలా ఉండాలో వారు మాకు నేర్పుతూ వ‌చ్చార‌ని అన్నాడు.

ప‌రిచ‌యం అయ్యాక‌. స‌ర‌దా ఆట‌లు, మెమరీ లేన్ లో వారు నడిచి వ‌స్తుండ‌గా కామెంట్ ఆక‌ట్టుకుంది. ప‌ద్మ‌శ్రీ చిత్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ గురించి కితాబు ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా కాజోల్ ను కూడా ర‌ణ్ వీర్(Ranveer Singh) ఆకాశానికి ఎత్తేశాడు.

దివంగ‌త తండ్రి య‌ష్ జోహార్ గురించిన ప‌రిచ‌యం, ఆయ‌న సాధించిన విజ‌యాల‌తో కూడిన క్లిప్ ను ప్ర‌ద‌ర్శించారు. ఇది క‌ర‌ణ్ కు అందిస్తున్న అరుదైన బ‌హుమ‌తి అంటూ పేర్కొన్నారు ర‌ణ్ వీర్ సింగ్.

ఈ సంద‌ర్భంగా తుజే దేఖా తో హే జానా స‌న‌మ్ అన్న పాట ను రివీల్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌ణ్ జోహార్ ర‌ణ్ వీర్ ను కౌగిలించుకున్నాడు.

రాహుల్ ఖ‌న్నా కిసీ సే న‌హీ ద‌ర్తా..లేకీ రోజ్ అంజ‌లీ శ‌ర్మ సే బాస్కెట్ బాల్ మే జ‌రూర్ హార్ తా హై అంటూ త‌న ఫంక్తుల‌ను చెప్పింది.

Also Read : వ్యాయామం తోనే ఆరోగ్యం

Leave A Reply

Your Email Id will not be published!