Kanye West Elon Musk : రాప‌ర్ కాన్వే వెస్ట్ ట్విట్ట‌ర్ ఖాతా బ్లాక్

ధ్రువీక‌రించిన ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్

Kanye West Elon Musk : ప్రపంచ సంగీత ప్ర‌పంచంలో మోస్ట్ పాపుల‌ర్ రాప‌ర్ గా పేరొందాడు కాన్వే వెస్ట్(Kanye West). మ‌నోడికి ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఉన్న‌ట్టుండి సోష‌ల్ మీడియాలో కాన్వే వెస్ట్ కీల‌క కామెంట్స్ చేశాడు. నియంతగా పేరొందిన హిట్ల‌ర్ ను కీర్తిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో రంగంలోకి దిగారు స్వ‌యంగా టెస్లా సిఇఓ, చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ కొత్త బాస్ ఎలాన్ మ‌స్క్. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో రాప‌ర్ కాన్వే వెస్ట్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు ఎలాన్ మ‌స్క్.

ఇదిలా ఉండ‌గా ర్యాప‌ర్ కాన్వే వెస్ట్ చేసిన వ్యాఖ్య‌లు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ పేర్కొన్నాడు. అందుకే కాన్వే వెస్ట్(Kanye West) ఖాతాను నిషేధం విధించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఎలాన్ మ‌స్క్. ఇదిలా ఉండ‌గా కాన్వే ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేశామ‌ని పూర్తిగా కాద‌ని స్ప‌ష్టం చేశారు.

ట్విట్ట‌ర్ రూల్స్ ను అతిక్ర‌మించినందుకు ర్యాప‌ర్ ఖాతాను నిలిపి వేసిన‌ట్లు పేర్కొన్నారు. అందుకే బ్లాక్ చేశామ‌ని పేర్కొన్నారు ఎలాన్ మ‌స్క్. ఇది పూర్తిగా హింస‌ను ప్రేరేపించ‌డం త‌ప్ప ఇంకేమీ కాద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా క్లారిటీ ఇచ్చారు ట్విట్ట‌ర్ బాస్(Elon Musk) . నేను నా వంతు ప్ర‌య‌త్నం చేశాను.

అయిన‌ప్ప‌టికీ హింస‌ను ప్రేరేపించేందుకు వ్య‌తిరేకంగా త‌మ నియ‌మాల‌ను ఉల్లంఘించార‌ని ..అందుకే ఖాతాను స‌స్పెండ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం ర్యాప‌ర్ కాన్వే ఖాతా బ్లాక్ వ్యవ‌హారం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : అమితాబ్ బ‌చ్చ‌న్ లివింగ్ లెజెండ్ – రావ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!