Yashwant Sinha : అరుదైన రాజకీయవేత్త యశ్వంత్ సిన్హా
1984లో ఐఏఎస్ కు రాజీనామా పాలిటిక్స్ లో ఎంట్రీ
Yashwant Sinha : ఇవాళ యశ్వంత్ సిన్హా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు.
సిన్హా విద్యాధికుడే కాదు అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. యశ్వంత్ సిన్హా (Yashwant Sinha)1984లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు రాజీనామా చేశారు.
అనంతరం జనతా పార్టీ సభ్యునిగా క్రియాశీల రాజకీయాల్లో చేరారు. నవంబర్ 6, 1937లో బీహార్ రాష్ట్రంలో పుట్టారు. పాట్నా లోని పాఠశాలలో చదివారు. పాట్నా యూనివర్శిటీలో అభ్యసించారు.
అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కేంద్ర మంత్రిగా పని చేశారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మంగళవారం ప్రకటించారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రతిపక్ష పార్టీలు సైతం యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలను కోరాయి.
1958లో పాట్నా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. 1958 నుండి 1960 వరకు ఆయన రాజనీతి శాస్త్రం బోధించారు. 1960 లో యశ్వంత్ సిన్హా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్ ) లో చేరారు.
24 ఏళ్ల పదవీ కాలంలో అనేక పదవులు చేపట్టారు. 1984లో ఐఏఎస్ కి రాజీనామా చేసి జనతా పార్టీలో క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
1988లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వీపీ సింగ్ నాయకత్వంలో జనతాదళ్ ఏర్పడినప్పుడు సిన్హా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
జనతాదళ్ ను విభజించి సమాజ్ వాది పార్టీని స్థాపించిన చంద్రశేఖర్ మంత్రివర్గంలో నవంబర్ 1990 నుండి 1991 దాకా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 1998లో వాజ్ పేయ్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014లో హజారీబాగ్ నుంచి ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది.
2018లో పాట్నాలో తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ మనసు మార్చుకున్నారు. 2021లో టీఎంసీలో చేరారు. ఆ పార్టీకి ఉపాధ్యక్షుడయ్యాడు.
Also Read : ‘వెంకయ్య’తో జేపీ..అమిత్ షా భేటీ