ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ దంచి కొట్టాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రెచ్చి పోయాడు. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆపై 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. ఒకానొక దశలో 13 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. ఈ సమయంలో మైదానంలోకి దిగాడు రషీద్ ఖాన్. పూనకం వచ్చినట్లు రెచ్చి పోయాడు.
ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. తనకు ఎదురే లేదని చాటాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. వాంఖడే స్టేడియం మొత్తం రషీద్ ఖాన్ ఆటకు ఫిదా అయ్యింది. ఒకానొక దశలో తన అద్భుతమైన ఆట తీరుతో గుజరాత్ టైటాన్స్ ను గెలుపు అంచుల దాకా తీసుకు వచ్చాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ ఖాన్ 3 ఫోర్లు 10 సిక్సర్లతో రెచ్చి పోయాడు . 79 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఒకానొక దశలో ముంబై ఇండియన్స్ జట్టు ఆశలు వదులుకుంది. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్లు చివరి దాకా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 191 పరుగులకు పరిమితం చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైనా పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది టైటాన్స్. ఇక సూర్య కుమార్ యాదవ్ తన కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు. 103 రన్స్ తో దంచి కొట్టాడు.
