Rashid Khan Hattrick : రషీద్ ఖాన్ తొలి హ్యాట్రిక్
అయినా తప్పని ఓటమి
Rashid Khan Hattrick : ఆఫ్గనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే బౌలర్ గా అసాధారణమైన రీతిలో రాణిస్తున్న ఖాన్ ఉన్నట్టుండి తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 16వ సీజన్ లో. లీగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఓ వైపు రషీద్ ఖాన్(Rashid Khan Hattrick) అద్భుతమైన బంతులతో ఆకట్టుకున్నా చివరకు తన జట్టును గెలిపించ లేక పోయాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ నితీష్ రాణా 45 రన్స్ చేసి రాణిస్తే వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 84 రన్స్ తో ఆకట్టుకున్నాడు. చివరి 2 ఓవర్లు కీలకంగా మారాయి.
ఈ తరుణంలో మైదానంలోకి దిగిన రింకూ సింగ్ పూనకం వచ్చినట్టు ఆడాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రధానంగా యశ్ దయాల్ ఆఖరి ఓవర్ లో ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు. అంతకు ముందు రషీద్ ఖాన్(Rashid Khan) బంతులతో మ్యాజిక్ చేశాడు.
తన కెరీర్ లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు. వరుస బంతులతో కోల్ కతా ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్ ,సునీల్ సరైన్ , శార్దూల్ ఠాకూర్ లను రషీద్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. ఐపీఎల్ లో రేర్ రికార్డ్ నమోదు చేశాడు. ఇదిలా ఉండా పాండ్యా అనారోగ్యం కారణంగా ఆడలేదు. అతడి స్థానంలో స్టాండింగ్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ బాధ్యతలు చేపట్టాడు.
Also Read : కోల్ కతా షాక్ గుజరాత్ కు ఝలక్