Rashid Latif : పాక్ క్రికెటర్లకు జీతాలు లేవు
మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కామెంట్స్
Rashid Latif : పాకిస్తాన్ – మాజీ పాకిస్తాన్ క్రికెటర్ , కామెంటేటర్, అనలిస్ట్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుపై సీరియస్ అయ్యాడు. జీతాలు ఇవ్వకుండా క్రికెటర్లు ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు.
Rashid Latif Shocking Comments on PCB
ఇదిలా ఉండగా బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 నడుస్తోంది. టైటిల్ ఫెవరేట్ గా ఉన్న పాకిస్తాన్ జట్టు ఉన్నట్టుండి అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. అన్ని రంగాలలో ఫెయిల్ అయ్యింది. చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో బలమైన సౌతాఫ్రికా జట్టుతో ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు ఆరు మ్యాచ్ లు ఆడింది. కేవలం 2 మ్యాచ్ లలో గెలుపొందింది.
ఇదిలా ఉండగా మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలుపొందినా సెమీ ఫైనల్ కు చేరుకోదు. దీంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ టీమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్బంగా రషీద్ లతీఫ్(Rashid Latif) పీసీబీపై ఫైర్ అయ్యాడు. గత 5 నెలలుగా క్రికెటర్లకు జీతాలు చెల్లించడం లేదంటూ ఆరోపించాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Pocharam Srinivas Reddy : బాబు ఆవేదన పోచారం ఆందోళన