Rashid Latif : ఆసియా కప్ హాట్ ఫేవరేట్ పాకిస్తాన్
ఇండియాకు సీన్ లేదన్న రషీద్ లతీఫ్
Rashid Latif : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 దాకా యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు కప్ గెలిచే సత్తా లేదని పేర్కొన్నాడు. టి20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ జరగలేదు.
కీలక మ్యాచ్ లో ఏకంగా పాకిస్తాన్ చేతిలో ఇండియా 10 వికెట్ల తేడాతో ఘోరమైన ఓటమి పాలైంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరీస్ ఆగి పోయింది.
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు ఇతర దేశాలలో జరిగినప్పుడు మాత్రమే పాకిస్తాన్ , టీమిండియా మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. తాజాగా ఆసియా కప్ లో ఈ రెండు దాయాది దేశాలు ఢీకొననున్నాయి.
ఇరు జట్లు తలపడినా గెలుపు మాత్రం పాకిస్తాన్ దే అవుతుందన్నాడు రషీద్ లతీఫ్(Rashid Latif). తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ క్యాట్ బిహైండ్ లో ఇరు జట్ల బలాబలాలపై స్పందించాడు.
భారత్ జట్టు ఇప్పటి వరకు కోలుకోలేదు కెప్టెన్సీ పరంగానని పేర్కొన్నాడు. ఒక్క ఏడాదిలో ఏకంగా బీసీసీఐ ఏడు మంది కెప్టెన్లను మార్చిందని దీని వల్ల స్పష్టత లోపించిందని తెలిపాడు లతీఫ్. మొత్తంగా బాబర్
అన్ని ఫార్మాట్ లలో భారత్ కంటే పాకిస్తాన్ మెరుగ్గా ఉందన్నాడు. ఏ సమయంలో నైనా ఒత్తిళ్లను తట్టుకుని నిలబడే సత్తా పాక్ ఆటగాళ్లకు ఉందని ప్రశంసించాడు.
Also Read : కేఎల్ రాహుల్ రాకతో కోహ్లీకి కష్టమేనా