Rashid Latif Ravi Shastri : ర‌విశాస్త్రిపై పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్

కోహ్లీ ప‌త‌నానికి మాజీ హెడ్ కోచ్ కార‌ణం

Rashid Latif Ravi Shastri : భార‌త జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు ర‌షీద్ ల‌తీఫ్‌. త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందించాడు. కోచ్ గా స‌క్సెస్ రేట్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ కోహ్లీ ప‌రంగా చూస్తే ఆశించిన మేర ట్రాక్ రికార్డు లేద‌ని ఆరోపించాడు.

అనిల్ కుంబ్లేను వివాదాస్ప‌దంగా తొల‌గించిన త‌ర్వాత 2017లో జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గా శాస్త్రి నియ‌మితుడయ్యాడు. కాగా బాధ్య‌త‌లు స్వీకరించిన‌ప్ప‌టి నుండి శాస్త్రి రెజ్యూమెలు అత‌నికి ముందు ఏ భార‌తీయ కోచ్ గానూ గ‌ర్వించ లేని విజ‌యాల‌తో నిండి ఉన్నాయి.

శాస్త్రి సార‌థ్యంలో భార‌త్ ఆస్ట్రేలియాలో రెండు టెస్టుల సీరీస్ గెలుపొందింది. అంతే కాకుండా జ‌ట్టు 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ప్రారంభ ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ , 2019 ప్ర‌పంచ క‌ప్ లో ఫైన‌ల్ కు చేరుకుంది.

కుంబ్లేను తొల‌గించి అత‌డి స్థానంలో శాస్త్రి తీసుకున్న నిర్ణ‌యం విఫ‌ల‌మైంద‌న్నాడు ర‌షీద్ ల‌తీఫ్‌(Rashid Latif Ravi Shastri) . విరాట్ కోహ్లీ ఫామ్ క్షీణించ‌డంతో శాస్త్రి కోచ్ గా నియ‌మించేందుకు స‌హ సంబంధం అందించ గ‌లిగాడ‌ని పేర్కొన్నాడు.

యూట్యూబ్ ఛానెల్ క్యాట్ బిహైండ్ లో విరాట్ కోహ్లీకి బ్రేక్ ఇవ్వాల‌ని శాస్త్రి ఇచ్చిన స‌ల‌హాపై స్పందించాల‌ని కోరడంపై పై కామెంట్స్ చేశాడు ర‌షీద్ ల‌తీఫ్‌. ర‌విశాస్త్రి కార‌ణంగానే ఇది జ‌రిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

శాస్త్రి 2014లో టీమ్ ఇండియా డైరెక్ట‌ర్ గా నియమితుడ‌య్యాడు. 2016లో కుంబ్లే ప్ర‌ధాన కోచ్ గా నియ‌మితుల‌య్యే వ‌ర‌కు బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కోహ్లీకి కుంబ్లే కు మ‌ధ్య విభేదాలు చోటు చేసుకోవ‌డంతో అర్ధాంత‌రంగా త‌ప్పుకున్నాడు. ఆపై శాస్త్రి వ‌చ్చాడు.

Also Read : 20 మంది ఆట‌గాళ్ల‌పై ద్ర‌విడ్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!