Rashmika Mandanna : ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారి పోయింది రష్మిక మందన్న. ఇవాళ ఆమె పుట్టిన రోజు. సామాజిక మాధ్యమాలలో రష్మికకు అభినందనలు, పుట్టిన రోజు శుభాకాంక్షలతో వెల్లువెత్తుతున్నాయి.
1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరజ్ పేట్ లో పుట్టారు ఆమె. ప్రస్తుతం రష్మికకు 25 ఏళ్లు. బహు భాషా నటిగా ప్రస్తుతం పేరొందారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ తో ఒక్కసారిగా యావత్ దేశం తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ అమ్మడు.
నటనలో ప్రత్యేకతను చాటుకుంటూనే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకు పోతోంది. 2016లో కిరాక్ పార్టీ అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది.
ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రష్మిక మందన్న(Rashmika Mandanna) ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్,
సైన్స్ అండ్ కామర్్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చదివారు.
రష్మిక మందన్న టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది.
2016లో 24వ ప్లేస్ దక్కించుకుంటే 2017లో మొదటి ప్లేస్ పొందింది. కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది.
ఒకరినొకరు ఇష్ట పడ్డారు. 2017 జూలైలో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అది బెడిసి కొట్టింది.
2014లో మోడలింగ్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ పేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలిచింది.
అనంతరం పునీత్ రాజ్ కుమార్ సరసన పుత్ర, గణేష్ సరసన ఛమక్ అనే కన్నడ మూవీలో నటించింది. నాగశౌర్యతో ఛలో చేసింది. సుల్తాన్ , మిషన్ మజ్నుతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
అంతకు ముందు విజయ్ దేవరకొండతో కలిసి చేసిన గీత గోవిందం సూపర్ హిట్. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరికొన్ని చిత్రాలలో నటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో అలరించాలని ఆశిద్దాం.
Also Read : ‘సిల్క్ సోనిక్’ సాంగ్ ఆఫ్ ది ఇయర్