Rasna Founder Dead : రస్నా ఫౌండర్ ‘ఖంబట్టా’ కన్నుమూత
అహ్మదాబాద్ లో గుండె పోటుతో మృతి
Rasna Founder Dead : రస్నా ఈ పేరు తెలియని వారంటూ భారత దేశంలో ఉండరు. రస్నా సంస్థ ఫౌండర్, వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ ఫిరోజ్ షా ఖంబట్టా గుండెపోటుతో(Rasna Founder Dead) కన్నుమూశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆయన తుది శ్వాస విడిచినట్లు రస్నా కంపెనీ సోమవారం వెల్లడించింది. అధికారికంగా ప్రకటించింది.
ఒకప్పుడు పెప్సీ, కోకో కోలా విదేశీ కంపనీలు డామినేట్ చేస్తున్న తరుణంలో రస్నా ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఐ లవ్ యూ రస్నా అన్న ప్రకటన చిన్నారుల నుంచి పెద్దల దాకా ఊహించని రీతిలో ఆకట్టుకుంది ఈ పానియం. ఇదిలా ఉండగా అరీజ్ ఫిరోజ్ షా ఖంబట్టా కు 85 ఏళ్లు.
గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఖంబట్టాకు భార్య పెర్సిస్ , పిల్లలు పిరుజ్, డెల్నా, రుఆన్ , కోడలు బినైషా, మనవళ్లు అర్జీన్ , అర్జాద్ , అవన్ , అరీజ్, ఫిరోజా, అర్నావాజ్ ఉన్నారు. దశాబ్దాల కిందట ఆయన తండ్రి ఫిరోజా ఖంబట్టా అత్యంత నిరాడంబరమైన వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ఆ తర్వాత ఆరీజ్ 60కి పైగా దేశాలలో ఉనికి కలిగి ఉన్న అతి పెద్ద రస్నా పానియాన్ని పరిచయం చేశాడు..విస్తరింప చేశాడు వ్యాపారాన్ని. అరీజ్ ఫిరోజ్ షా ఖంబట్టా 1970లలో అధిక ధరలకు విక్రయించే శీతల పానియాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా రస్నా సరసమైన శీతల పానీయాల ప్యాక్ లను సృష్టించాడు.
దేశంలోని 1.8 మిలియన్ రిటైల్ అవుట్ లెట్లలో విక్రయిస్తున్నారు. ఇది ఓ రికార్డ్ . ఆయన మృతితో గొప్ప వ్యాపారవేత్తను కోల్పోయింది భారత దేశం.
Also Read : ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్