Ratan Tata : ఊపిరి ఉన్నంత వ‌ర‌కు దేశం కోస‌మే

భార‌త వ్యాపార దిగ్గ‌జం ర‌త‌న్ టాటా

Ratan Tata : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన వ్యాపార వేత్త‌ల‌లో టాటా గ్రూపు సంస్థ‌ల చైర్మ‌న్ ర‌త‌న్ టాటా (Ratan Tata)ఒక‌రు. ఆయ‌న త‌న‌కు వ‌చ్చిన దాంట్లోంచి స‌మాజ సేవ‌కు అత్య‌ధిక వాటాను ఉప‌యోగిస్తారు.

కోట్లాది రూపాయ‌ల సంప‌ద ఉన్న‌ప్ప‌టికీ నేటికీ ఆయ‌న నిరాడంబ‌రంగా ఉంటారు. ఆయ‌న జీవిత‌మే ఆద‌ర్శ‌నీయం. ఈ దేశం అంటే, సంస్కృతి సంప్ర‌దాయాలు అన్నా ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానం.

ర‌త‌న్ టాటా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌స్తుతం నేను చ‌ర‌మాంకంలో ఉన్నా. న‌న్ను సేవ‌కు అంకితం చేయ‌నీయండి అంటూ కోరారు టాటా. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో క‌లిసి ఏడు అత్యాధునిక క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల‌ను ప్రారంభించారు.

మ‌రో ఏడు ఆస్ప‌త్రుల‌కు శంకుస్థాప‌న చేశారు. అస్సామ్ ను అంద‌రూ గుర్తించేలా , దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా తీర్చి దిద్దేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని చెప్పారు. ఊపిరి ఉన్నంత వ‌ర‌కు దేశం కోసం పాటు ప‌డ‌తాన‌ని స్పష్టం చేశారు.

చివ‌రి సంవ‌త్స‌రాల‌ను ఈ రాష్ట్రాన్ని మ‌హోన్న‌తంగా తీర్చి దిద్దేందుకు అంకితం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు ర‌త‌న్ టాటా చెప్పారు. ఒక‌ప్పుడు వైద్యం అంద‌క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

కాలం మారింది. టెక్నాల‌జీ విస్త‌రించింది. అత్యాధునిక నైపుణ్యాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇది అద్భుత‌మైన కాలం. దీనిని గుర్తించి ఒడిసి ప‌ట్టుకోగ‌లిగితే వేలాది మందికి సేవ‌లు చేయ‌గ‌లుగుతామ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ర‌త‌న్ టాటా.

ఈ సంద‌ర్భంగా అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ర‌త‌న్ టాటా అందించిన సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆయ‌న‌కు స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.

Also Read : నా ప‌ద‌వి ప‌దిలం ట్విట్ట‌ర్ శాశ్వ‌తం – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!