Tirumala Ratha Saptami : తిరుమ‌ల‌లో ఘ‌నంగా ర‌థ‌స‌ప్తమి

ఒకే రోజు ఏడు వాహ‌నాల‌పై ద‌ర్శ‌నం

Tirumala Ratha Saptami : తెలుగు రాష్ట్రాల‌లో ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. తిరుమ‌ల‌లో ర‌థ స‌ప్త‌మి(Tirumala Ratha Saptami) వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈసారి భ‌క్త జ‌న‌సందోహం లేకుండానే ఉత్స‌వాలు ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించే భాగ్యాన్ని ప్ర‌సాదించ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సూత్ర‌ప్రాయంగా వెల్ల‌డించారు.

ఇక ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ల‌య్య‌ప్ప స్వామి సూర్య ప్ర‌భ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు శ్రీ స్వామి వారు.

క‌రోనా కార‌ణంగా స్వామి వారి సేవ‌ల‌ను ఊరేగింపుగా నిర్వ‌హించ‌కుండా కేవ‌లం నాద నీరాజ‌న మండపంలో మాత్ర‌మే ఏర్పాటు చేసింది టీటీడీ. ర‌థ సప్త‌మి ఉత్స‌వాలు(Tirumala Ratha Saptami) ఇవాళ రాత్రి 10 గంట‌ల దాకా జ‌రుగుతాయి.

శ్రీ వేంక‌టేశ్వ‌రుడు 10 గంట‌ల వ‌ర‌కు చిన్న శేష వాహ‌నంపై, 11 నుంచి 12 గంట‌ల దాకా గ‌రుడ వాహ‌నంపై ఊరేగుతారు. మ‌ధ్యాహ్నం 1 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నంపై, 2 గంట‌ల నుంచి 3 గంట‌ల దాకా చ‌క్ర స్నానం చేస్తారు.

ఇక సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై ఊరేగుతారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ భూపాల వాహ‌నంపై ఆ దేవ‌దేవుడు ద‌ర్శ‌నం ఇస్తారు.

8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు చంద్ర ప్ర‌భ వాహ‌నంపై ఊరేగుతారు. ఇదిలా ఉండ‌గా ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో య‌ధావిధిగా జ‌రిగే ఆర్జిత సేవ‌ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ర‌ద్దు చేసింది.

Also Read : జ‌గ‌న్ అద్బుత‌మైన పాల‌కుడు

Leave A Reply

Your Email Id will not be published!