Ratna Rasheed Banerjee : దీదీకి పుర‌స్కారం ర‌త్న ర‌షీద్ ఆగ్రహం

అవార్డు వాప‌స్ ఇచ్చేసిన ర‌చ‌యిత్రి

Ratna Rasheed Banerjee : ప్ర‌ముఖ బెంగాలీ ర‌చయిత్రి ర‌త్న రషీద్ బెన‌ర్జీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె త‌న‌కు ఇచ్చిన ఉన్న‌త పుర‌స్కారాన్ని తిరిగి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆమె సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీదీకి సాహిత్య గౌర‌వం ల‌భించడాన్ని ర‌త్న ర‌షీద్ బెన‌ర్జీ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇచ్చే అన్న‌దా శంక‌ర స్మారక్ స‌మ్మాన్ ను తిరిగి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆమె(Ratna Rasheed Banerjee) చేసిన సాహిత్య కృష్టికి గాను ఈ అవార్డును ర‌త్న ర‌షీద్ బెన‌ర్జీకి 2019లో ప్ర‌భుత్వం అంద‌జేసింది. రాజ‌కీయ రంగంలో ఉన్న వ్య‌క్తికి ఎలా ఈ పుర‌స్కారానికి ఎంపిక చేస్తారంటూ ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉండగా సాహిత్య రంగానికి విశిష్ట సేవ‌లు అందించినందుకు గాను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ప్ర‌త్యేక అవార్డును ప్ర‌దానం చేయాల‌ని నిర్ణ‌యించింది రాష్ట్ర అకాడెమీ.

దీంతో త‌న‌కు అకాడెమీ అంద‌జేసిన అవార్డును ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బెంగాలీ ర‌చ‌యిత్రి, జాన‌ప‌ద సంస్కృతి ప‌రిశోధ‌కురాలు. విద్యా శాఖ మంత్రి అయిన అకాడ‌మీ చైర్మ‌న్ బ్ర‌త్య బ‌సుకు లేఖ రాసింది ర‌త్న ర‌షీద్ బెన‌ర్జీ(Ratna Rasheed Banerjee).

బెన‌ర్జీ జ‌యంతి సంద‌ర్భంగా సీఎంకు కొత్త సాహిత్య పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేయాల‌ని నిర్ణ‌యించ‌డం ఈ అవార్డు త‌న‌కు ముళ్ల కిరీటం లాగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు .

సీఎంకు సాహిత్య పుర‌స్కారం ఇవ్వడాన్ని ర‌చ‌యిత‌గా అవ‌మానించిన‌ట్లుగా భావిస్తున్నాను. రాగూర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో 900 కు పైగా క‌విత‌ల‌తో కూడిన క‌బితా బితాన్ అనే సీఎం పుస్త‌కానికి ఈ ఏడాది ప్ర‌వేశ పెట్టిన అవార్డును ఇస్తున్న‌ట్లు అకాడెమీ ప్ర‌క‌టించింది.

 

Also Read : దేశం వెన‌క్కి వెళుతున్న విమానం

Leave A Reply

Your Email Id will not be published!