Ravi Shastri Dhoni Viral : ర‌వి శాస్త్రి..ఎంఎస్ ధోనీ హ‌ల్ చ‌ల్

సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్

Ravi Shastri Dhoni Viral : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి, మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ గా ఉన్న మ‌హేంద్ర సింగ్ ధోనీ వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇంగ్లండ్ టూర్ లో భార‌త క్రికెట్ జ‌ట్టు టి20 సీరీస్ లో భాగంగా మొద‌టి, రెండో టి20 మ్యాచ్ ల‌లో ఘ‌న విజ‌యం సాధించింది. మూడో టి20 మ్యాచ్ లో ఇంగ్లండ్ 17 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ చేసింది.

ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ర‌వి శాస్త్రి, ఎంఎస్ ధోనీ(Ravi Shastri Dhoni Viral) ఇద్ద‌రూ క‌లిసి హ‌ల్ చ‌ల్ చేశారు. ఇంగ్లండ్ లోనే భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) చీఫ్ సౌర‌వ్ గంగూలీతో పాటు ర‌వి శాస్త్రి, ధోనీ ఉన్నారు.

ధోనీ భార‌త్ ఆడుతున్న మ్యాచ్ లలో ద‌ర్శ‌నం ఇచ్చాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ. నాటింగ్ హోమ్ లోని ట్రెంట్ బ్రిడ్జిలో భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య ఈ మ్యాచ్ చోటు చేసుకున్న సంద‌ర్భంగా ఇద్ద‌రు దిగ్గ‌జ ఆట‌గాళ్లు హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఈ ఇద్ద‌రు క‌లిసి చాలా సేపు ముచ్చ‌టించుకున్నారు. అక్క‌డే ఉన్న కెమెరాలు క్లిక్కు మ‌నిపించాయి. వీరి ఫోటోలు సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేశాయి.

ప్ర‌స్తుతం యూకేలో విహార యాత్ర‌లో ఉన్న ధోనీ సీరీస్ లోని చివ‌రి మ్యాచ్ ని వీక్షించేందుకు కొంత స‌మ‌యం తీసుకున్నాడు. ఎడ్జ్ బాస్ట‌న్ లో జ‌రిగిన రెండో మ్యాచ్ లో ధోనీ కూడా స్టాండ్స్ లో ఉన్నాడు.

భార‌త్ 49 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్భంగా ర‌వి శాస్త్రి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మంచిగా క‌నిపించే మాస్ట్రోని క‌లుసు కోవ‌డం చాలా బాగుంద‌న్నారు.

Also Read : కోహ్లీ ఫామ్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!