Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో తరుపు ముక్క లాగా పేరొందాడు కేరళకు చెందిన క్రికెటర్ సంజూ శాంసన్.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ టీంకు కెప్టెన్ గా ఉన్నాడు. కానీ నిలకడ లేని తనం అతడిని ఇంకా ఇబ్బంది పెడుతోంది. ఒక మ్యాచ్ ఆడితే రెండు మ్యాచ్ లలో విఫలం కావడం పరిపాటిగా మారింది.
నిన్న కీలకమైన మ్యాచ్ జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో. కేవలం 8 బంతులు ఆడి 8 రన్స్ చేశాడు. ఆ తర్వాత క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే సమయంలో సారథిగా క్రీజులో ఉండాల్సి ఉంది.
కానీ నిర్లక్ష్యంగా షాట్ ఆడుతూ వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం తెలిపాడు రవిశాస్త్రి. ఎలాంటి వత్తిడి లేకుండా ఆడడంలో సంజూ శాంసన్ కు పెట్టింది పేరు. ఒక రకంగా మిస్టర్ కూల్ అన్న పదానికి ధోనీనే కాదు ద్రవిడ్, సంజూ శాంసన్ సరిపోతాడు.
ఈ తరుణంలో ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రెండింట్లో గెలిచి ఒకటి ఓడి పోయింది. శాంసన్ కారణమంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. శాంసన్ విరాట్ కోహ్లీ లాగా మారాలంటే ముందు తన ఆట తీరును మార్చు కోవాలని సూచించాడు.
ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఉత్తేజకరమైన ప్రతిభావంతుల్లో శాంసన్ ఒకడు. కాదనను. కానీ సహచరుల అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు శాస్త్రి(Ravi Shastri .
27 ఏళ్ల సంజూ మరింత రాణించాలంటే చాలా కష్టపాడాల్సి ఉంటుందన్నాడు. ఆట తీరు బాగానే ఉన్నా అనవసర షాట్స్ ఆడకుండా ఉంటే బెటర్ అని సూచించాడు.
Also Read : వన్డే ర్యాంకింగ్స్ లో ‘మిథాలీ..మందాన