Ravi Shastri : కోహ్లీ గంభీర్ మధ్య సయోధ్యకు రెడీ
స్పష్టం చేసిన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి
Ravi Shastri : ఐపీఎల్ 16వ సీజన్ లో హాట్ టాపిక్ గా మారింది ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ , లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య చోటు చేసుకున్న వివాదం. ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు విక్టరీ సాధించింది. అనంతరం మైదానంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. చివరకు కొట్టుకునేంత స్థాయికి చేరుకుంది. లక్నో స్కిప్పర్ కేఎల్ రాహుల్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.
బీసీసీఐ రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేసింది. గంభీర్ కు సైతం మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది బీసీసీఐ. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ ను అతిక్రమించినట్లు తేలిందని అందుకే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
దీంతో తాజాగా కీలక ప్రకటన చేశారు భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి. విరాట్ కోహ్లీకి శాస్త్రికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే గంగూలీ బీసీసీఐకి బాస్ గా కొలువు తీరారో అప్పుడే విరాట్ కోహ్లీకి, రవి శాస్త్రికి(Ravi Shastri) చెక్ పెట్టాడు. ఈ తరుణంలో కోహ్లీకి, గౌతమ్ గంభీర్ కు మధ్య చోటు చేసుకున్న వివాదానికి తెర దించేందుకు తాను ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ఆ ఇద్దరి మధ్య అంతరాన్ని తొలగించి సయోధ్య కుదిర్చేందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.
Also Read : నా ప్లేయర్ ను తిడితే నన్ను తిట్టినట్లే