Ravi Shastri : పాండ్యాపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై
Ravi Shastri : ఐపీఎల్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇండియాలో హాట్ టాపిక్ గా మారాడు. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఎంపికైన ఈ క్రికెటర్ ఉన్నట్టుండి దుమ్ము రేపాడు.
నాయకుడిగా, ఆటగాడిగా సత్తా చాటాడు. బౌలింగ్ లో , బ్యాటింగ్ లో తనదైన ముద్రతో రాణించాడు. ప్రస్తుతం భారత జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
ఐపీఎల్ పుణ్యమా అని యువ క్రికెటర్లు దుమ్ము రేపుతున్నారు. దంచి కొడుతున్నారు. వీరి దెబ్బకు సీనియర్ క్రికెటర్లు జడుసు కుంటున్నారు.
దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) సెలెక్టర్లకు తలకు మించిన భారంగా తయారైంది జట్టును ఎంపిక చేయడం. ఉన్న 11 మంది ఆటగాళ్లకు గాను 30 మందికి పైగా ఆటగాళ్లు రెడీగా ఉన్నారు ఆడేందుకు.
ఎవరిని తొలగించాలో ఎవరిని ఎంపిక చేయాలనేది కత్తి మీద సాము లాగా మారింది. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) సంచలన కామెంట్స్ చేశాడు హార్దిక్ పాండ్యాపై(Hardik Pandya).
రాను రాను వన్డే మ్యాచ్ లలో ఆడేందుకు ప్లేయర్లు ఆసక్తి చూపడం లేదని దీంతో పాండ్యా కూడా వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు బాంబు పేల్చాడు.
ప్రస్తుతం రవి శాస్త్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా ఈసీబీకి షాక్ ఇచ్చాడు.
తాను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రవిశాస్త్రి(Ravi Shastri) కామెంట్స్ పై హార్దిక్ పాండ్యా ఇంకా స్పందించ లేదు.
Also Read : చోప్రా విజయం అంతటా సంబురం