Ravi Shastri : పాట్ క‌మ్మిన్స్ పై ర‌విశాస్త్రి కామెంట్

అత‌డిని త‌ప్పించ‌డంపై ఆగ్ర‌హం

Ravi Shastri : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్, కోచ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు.

లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో కేకేఆర్ 52 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక కోల్ క‌తా విజ‌యంలో పాట్ క‌మ్మిన్స్ కీల‌క పాత్ర పోషించాడు.

ముంబైకి చుక్క‌లు చూపించాడు. ఒకే ఓవ‌ర్ లో మూడు ప్ర‌ధాన వికెట్ల‌ను తీశాడు. విచిత్రం ఏమిటంటే కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్ ల‌కు క‌మ్మిన్స్ ను దూరం పెట్టారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రూల్స్ క‌ఠినంగా ఉంటాయి.

వాటిని సంతృప్తిక‌రంగా పూర్తి చేసిన అనంత‌రం పాట్ క‌మ్మిన్స్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. వ‌స్తూనే వికెట్లు ప‌డగొట్టాడు. ఈ ఫాస్ట్ బౌల‌ర్ వ‌స్తూనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపాడు.

అంతే కాదు వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్ లు ఆడాక క‌మ్మిన్స్ ను తొల‌గించారు. తిరిగి మ‌ళ్లీ వ‌చ్చాడు. తానేమిటూ నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా నాలుగు మ్యాచ్ ల‌కు పాట్ క‌మ్మిన్స్ ను త‌ప్పించ‌డం ప‌ట్ల భార‌త జ‌ట్టు మాజీ కోచ్ ర‌విశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.

ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ ఫాస్ట్ బౌల‌ర్. ప్రపంచ క‌ప్ విజేత‌. ఆసిస్ కెప్టెన్ ని బెంచ్ పై కూర్చో బెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు ర‌విశాస్త్రి(Ravi Shastri).

ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించాడు. ఘ‌న విజ‌యాన్ని చేకూర్చి పెట్ట‌డంలో పాట్ క‌మ్మిన్స్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ విజ‌యంలో ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు మార్గం ఏర్ప‌డింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు.

 

Also Read : ముంబై ఇండియ‌న్స్ ఇక ఇంటికే

Leave A Reply

Your Email Id will not be published!