ఐపీఎల్ 16వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ సేన సమిష్టి కృషితో సత్తా చాటుతోంది. ఊహించని రీతిలో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్లింది. ఆరంభంలో నిరాశ పరిచినా ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పుంజుకుంది. ఇతర జట్లకు చుక్కలు చూపించింది. మిస్టర్ కూల్ కెప్టెన్సీ మరోసారి ఆ జట్టుకు అదనపు బలంగా మారింది.
కెప్టెన్ ధోనీ టాస్ గెలిచాడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. చివరలో వచ్చిన ధోనీ మెరిసాడు. 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్సర్లతో రెచ్చి పోయాడు.విలువైన 20 రన్స్ చేశాడు.
ఇక ఎప్పటి లాగే రవీంద్ర జడేజా తనదైన మార్క్ చూపించాడు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటాడు. కేవలం 16 బాల్స్ ఎదుర్కొని 21 రన్స్ చేశాడు.జడేజా కంటే ముందు శివమ్ దూబే 25 రన్స్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ 24, అంబటి రాయుడు 23, అజింక్యా రహానే 21 రన్స్ చేశారు. అంతే కాదు 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఈ గ్రాండ్ విక్టరీతో సీఎస్కే పాయింట్ల పట్టికలో టాప్ 3 లోకి దూసుకు వెళ్లింది. మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి ఆ జట్టుకు
