Ravish Kumar Comment : తలవంచని తత్వం ధిక్కార పతాకం
ప్రజా గొంతుకు ప్రతిరూపం రవీష్ కుమార్
Ravish Kumar Comment : మోడీ మాయలో కొట్టుకు పోతున్న భారత దేశంలో..మీడియాలో ఒకే ఒక్కడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక రకంగా అన్ని టీఆర్పీ రేట్లను కాదనుకుని ఆ జర్నలిస్టు ఎవరూ అని వెతుకుతోంది.
యావత్ భారతమంతా క్రికెట్ జోష్ లో, అదానీ, అంబానీని కీర్తించడంలో మునిగి పోయిన తరుణంలో సైతం సదరు నిఖార్సైన బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ ధిక్కార స్వరాన్ని వినిపించారు.
ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని , వారి కోసం చని పోయేందుకు సిద్దమేనని ప్రకటించిన నిబద్దత కలిగిన, ఎన్నదగిన పాత్రికేయుడు రవీష్ కుమార్.
ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆయనను గుర్తు పడతారు. తమ గురించి మాట్లాడతుంటే మైమరిచి పోతుంటారు. రవీష్ కుమార్ వేసే ప్రశ్నలు చాలా కచ్చితంగా ఉంటాయి. మనల్ని సూటిగా గుండెల్ని తాకుతాయి.
ప్రశ్నించడం నేరంగా మారిన ఈ తరుణంలో, అన్ని వ్యవస్థలు కునారిల్లి పోయి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే భుజాన వేసుకుని భజన చేస్తున్న సమయంలో రవీష్ కుమార్(Ravish Kumar) వినిపించిన ధిక్కార స్వరానికి కోట్లాది జనం ఫిదా అయ్యారు.
అంతకంటే ఎక్కువగా జేజేలు పలికారు. కులం, ప్రాంతం, మతం, వ్యాపారం, విద్వేషాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత సమాజంలో సామాన్యుల పక్షాన ప్రశ్నించడం ప్రారంభించాడు రవీష్ కుమార్.
అన్యాయాన్ని ప్రశ్నించడం మానుకోను. కానీ ప్రాణం తీసినా సరే తలవంచను అని స్పష్టం చేశాడు. కొన్నేళ్ల పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాడు.
తన వంతుగా వెలుగులోకి తీసుకు వచ్చేందుకు యత్నించాడు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా కృషి చేశాడు. నిస్పాక్షికంగా, పని పట్ల నిజాయితీతో ఉండాలని కోరుకున్నాడు. దానినే ఆయన అమలు చేస్తున్నాడు. టీఆర్పీ రేటింగ్ లను ఆధారంగా చేసుకుని నడుస్తున్న వాటి జోలికి వెళ్లడు.
మనం చేసే పనిలో వాస్తవం ఉంటే జనం చూస్తారంటాడు రవీష్ కుమార్. కొన్నేళ్ల పాటు మీడియా సంస్థలో పని చేసిన రవీష్ కుమార్ ఉన్నట్టుండి తప్పుకున్నాడు.
ఆ వెంటనే ఆయన గురించి చర్చ జరిగింది. ఇదే సమయంలో తాను స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. కొద్ది సేపట్లోనే లక్షలాది మంది సబ్ స్కైబ్ చేసుకున్నారు. ఇవాళ దేశంలో ప్రతిపక్షం అన్నది లేకుండా పోయింది.
రవీష్ కుమార్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాడు. కోట్లాది మంది పిల్లలు , ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సర్కార్ పై లేదా అని నిలదీస్తున్నాడు.మతం పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని స్పష్టం చేస్తున్నాడు రవీష్ కుమార్(Ravish Kumar).
రవీష్ కుమార్ జర్నలిస్టు మాత్రమే కాదు..జగమెరిగిన రచయిత కూడా. చదవడం, రాయడం, తను అనుకున్న దానికి కట్టుబడి ఉండడం చాలా ఇష్టం.
ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. డిసెంబర్ 5, 1974లో బీహార్ లోని జిత్వార్ పూర్ ఊరులో పుట్టాడు. సివిల్స్ లోకి
ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ సాధంచ లేక పోయాడు.
అయితే దేశం కోసం ప్రజల కోసం పని చేయాలన్న తపనే అతడిని జర్నలిస్టుగా మార్చేలా చేసింది. ఢిల్లీ యూనివర్శిటీలో పార్థ సారథి గుప్తాతో ప్రభావితం అయ్యాడు.
అనిల్ సేథీ అతడిలోని మరో కోణాన్ని గుర్తించి వెన్ను తట్టారు. ఆనాటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడ లేదు రవీష్ కుమార్. గ్రామీణ రిపోర్టింగ్ నుండి రామన్ మెగసెసే అవార్డు వరకు ప్రయాణం సాగింది. దేశానికి సంబంధించిన ప్రతి సమస్యను ప్రస్తావించేలా చేశాడు రవీష్ కుమార్(Ravish Kumar).
వాట్సాప్ యూనివర్శిటీ పట్ల జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తూ వచ్చాడు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయన పనితీరుకు దక్కాయి.
రవీష్ కుమార్ మళ్లీ ప్రజల కోసం అడుగులు వేస్తున్నాడు. తన గొంతుకతో ప్రశ్నిస్తున్నాడు..పలవరించేలా చేస్తున్నాడు..వర్ధమాన జర్నలిస్టులకు ఆయనో స్పూర్తి.
Also Read : నా కలానికి పొగరు ఎక్కువ – రవీష్ కుమార్
Nice article.